ముస్లింల సమస్యలు పరిష్కరిస్తాం

ముస్లింల సమస్యలు పరిష్కరిస్తాం

ముస్లింల సమస్యలు పరిష్కరిస్తాంప్రజాశక్తి – తిరుపతి టౌన్‌, యంత్రాంగం అసూయ, ద్వేషం వీడి త్యాగనిరతిని ప్రతి ఒక్కరూ అలవరచుకోవాలని తిరుపతి ఎంఎల్‌ఎ ఆరణి శ్రీనివాసులు అన్నారు. ఎన్నికల వరకూ రాజకీయాలని, ఎన్నికల తరువాత అభివృద్ధే తన అజెండా అని అన్నారు. ముస్లీంల సమస్యలు పరిష్కరిస్తానని చెప్పారు. ఎస్వీ యూనివర్సిటీ సమీపంలోని ఈద్గా మైదానంలో బక్రీద్‌ సందర్భంగా ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈద్గా స్థల వివాదాన్ని పవన్‌కల్యాణ్‌, చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, టిడిపి పార్లమెంట్‌ అధ్యక్షులు నరసింహ యాదవ్‌, టిడిపి రాష్ట్ర మైనార్టీసెల్‌ నాయకుడు మహబూబ్‌ బాషా, అలీ ఖాన్‌, షేక్‌ అర్షద్‌ పాల్గొన్నారు. చంద్రగిరిలో ఎంఎల్‌ఎ పులివర్తి నానికి ముస్లీం మత పెద్దలు ఘనంగా స్వాగతం పలికారు. తాను ఎంఎల్‌ఎగా గెలిచిన తరువాత మొదటి పండుగ బక్రీద్‌ అని అన్నారు. బీటీఆర్‌ కాలనీ మసీదులో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈద్గా ప్రహరీ కూలిపోయిందని, నీటి వినియోగానికి బోరు, విద్యుదీకరణ, సిసి రోడ్డు నిర్మించాలని ముస్లీం సోదరులు కోరారు. గూడూరు ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఓజిలిలో టిడిపి మండల కన్వీనర్‌ గుజ్జులపూడి విజరుకుమార్‌నాయుడు, కంకణాల వరప్రసాద్‌నాయుడు, పాడి వెంకట సుబ్బయ్య ప్రార్థనల్లో పాల్గొన్నారు. పుత్తూరులో నమాజ్‌ చేసి ఆత్మీయ ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇమామ్‌ సాహెబ్‌, మౌసన్‌ సాహెబ్‌ పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలో ఎంఎల్‌ఎ బొజ్జల వెంకట సుధీర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈదులగుంట ఈద్గాతో తన తండ్రి బొజ్జలకు విడదీయరాని బంధం ఉందన్నారు. విజరుకుమార్‌, జామియా మసీద్‌ ముత్తవల్లి అక్రమ, అంజాద్‌బాషా, షాకీర్‌అలీ పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా వి.కోటలో ముస్లీంలు ర్యాలీగా వెళ్లి సామూహిక ప్రార్థనల్లో పాల్గొన్నారు. కార్వేటినగరం పంచాయతీలోనూ ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇమామ్‌సాహెబ్‌, మౌసన్‌ సాహెబ్‌ పాల్గొన్నారు. జీడీనెల్లూరు తూగుండ్రం పంచాయతీ ఆవలకొండలో ముస్లీంలకు చెందిన చిన్నారులు, యువకులు, పెద్దలు అజాఖానాయే జహారాలో ప్రత్యేక ప్రదర్శనలు చేశారు. అంజుమన్‌ అబ్బాసియా కమిటీ అధ్యక్షుడు నియాజ్‌అలీ, కార్యదర్శి షాకిర్‌ అలీ, యగ్బాల్‌, రహమత్‌ , అంజత్‌ అలీ, మెహదిఅలీ, పాల్గొన్నారు. బంగారుపాళ్యంలో పాలేరు ఈద్గా వద్ద ప్రార్థనలు నిర్వహించారు. పలమనేరులో ఎంఎల్‌ఎ అమరనాథ్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. నాయకులు కోదండ యాదవ్‌, నాగేశ్వరరాజు, జిల్లా మైనార్టీ అధ్యక్షులు ఖాజాపీర్‌, ఆర్‌వి బాలాజీ, కిషోర్‌గౌడ్‌ పాల్గొన్నారు.

➡️