చంద్రబాబు విజన్‌తో తిరుమల అభివృద్ధిటిటిడి ఈవో శ్యామలరావు బాధ్యతలు స్వీకరణపారిశుధ్య నిర్వహణ బాగోలేదని ఆగ్రహం

చంద్రబాబు విజన్‌తో తిరుమల అభివృద్ధిటిటిడి ఈవో శ్యామలరావు బాధ్యతలు స్వీకరణపారిశుధ్య నిర్వహణ బాగోలేదని ఆగ్రహం

చంద్రబాబు విజన్‌తో తిరుమల అభివృద్ధిటిటిడి ఈవో శ్యామలరావు బాధ్యతలు స్వీకరణపారిశుధ్య నిర్వహణ బాగోలేదని ఆగ్రహంప్రజాశక్తి – తిరుమల హిందువులందరికీ తిరుమల పవిత్రమైన దేవాలయమని, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానానికి ఈవోగా రావడం తన అదృష్టమని, ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్‌తో తిరుమలను అభివృద్ధి చేస్తానని నూతన ఈవో జె.శ్యామలరావు అన్నారు. టిటిడి కార్యనిర్వహణాధికారిగా ఆదివారం తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టిటిడి ఈవో ఎవి ధర్మారెడ్డి నుంచి బాధ్యతలను స్వీకరించారు. సతీమణితో కలిసి శ్రీవారి దర్శనం చేసుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. ఆ తర్వాత జెఇఒ వీరబ్రహ్మం ఈవోకు శ్రీవారి ప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు. తిరుమల క్షేత్ర సంప్రదాయాన్ని పాటిస్తూ ముందుగా శ్రీ వరాహ స్వామివారిని ఈవో దర్శించుకున్నారు. ఆ తర్వాత వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ ద్వారా శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించారు. జెఇఒ గౌతమి, సివిఎస్‌ఒ నరసింహకిషోర్‌, ఎస్వీబీసీ సిఇఒ షణ్ముఖ్‌ కుమార్‌, డిప్యూటీ ఈవో లోకనాధం పాల్గొన్నారు. దర్శన క్యూలైన్లు పరిశీలన దర్శన క్యూలైన్లను నూతన ఈవో శ్యామలరావు పరిశీలించారు. క్యూలైన్ల వద్ద పారిశుధ్యం నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతలు చేపట్టినరోజే క్షేత్రస్థాయి పరిశీలన చేయడం గమనార్హం. భక్తులకు అందించే తాగునీటిని పరిశీలించి ల్యాబ్‌కు పంపించాలని ఆదేశించారు. ఇద్దరు పారిశుధ్య అధికారులకు మెమోలు జారీ చేశారు. టిటిడి ప్రక్షాళన దిశగా చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

➡️