సువర్ణముఖీ నది వంతెనపై ట్రాఫిక్‌ జాం

Apr 25,2024 21:12

 ప్రజాశక్తి – సీతానగరం : స్థానిక సువర్ణముఖీ నది వంతెనపై ట్రాఫిక్‌ రెండు గంటల పాటు ట్రాఫిక్‌ నిలిచిపోవడంతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. గురువారం ఉదయం 9:30 నుంచి 11:30 వరకు ట్రాఫిక్‌ నిలిచిపోయింది. ట్రాఫిక్‌ నిలిచిపోవడంతో అప్పయ్యపేట వరకు అలాగే చినబోగిలి వరకు వాహనాలు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో భానుడు ప్రభావం ఎక్కువ ఉండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈ వంతెనపై భారీగా వాహనాలు రాకపోకలు నియంత్రిస్తే కానీ ఈ ట్రాఫిక్‌ సమస్య పోదని ప్రయాణికులు అంటున్నారు. అలాగే బ్రిడ్జి మరమ్మతులకు చేసినప్పటికీ ఎప్పుడు కూలుతుందోనని ప్రజలు, ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎట్టకేలకు పోలీసు జోక్యం చేసుకొని వాహనాలను నియంత్రించి ట్రాఫిక్‌ సమస్య పరిష్కరించే వరకూ దగ్గరుండి అన్ని వాహనాల రాకపోకలను నియంత్రించారు. అయితే బ్రిడ్జిపై నిరంతరం ట్రాఫిక్‌ సమస్య పరిష్కారం కోసం అధికార యంత్రాగం చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు

➡️