కలెక్టర్లు బదిలీ!

కడప కలెక్టర్‌గా లోతేటి శివశంకర్‌అన్నమయ్య కలెక్టర్‌గా చామకూరి శ్రీధర్‌ ప్రజాశక్తి – కడప ప్రతినిధి కడప, అన్నమయ్య జిల్లాల కలెక్టర్లు బదిలీ అయ్యారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం మంగ ళవారం మధ్యాహ్నం ఉత్తర్వులు జారీ చేసింది. 2021 జులైలో కడప కలెక్టర్‌గా విజయరామరాజు బాధ్యతలు స్వీకరి ంచారు. ఈయన 2024 జులై 02వ తేదీ వరకు సుమారు మూడేళ్లపాటు సేవలం దించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో కొత్తప్రభుత్వం అధికారం చేపట్టిన నేపథ్యంలో అధికారులను బదిలీలు చేస్తోంది. ఇందులోభాగంగానే మొదటి విడత కింద ఇటీవల రాష్ట్రంలోని సుమారు 18 జిల్లాలకు చెందిన కలెక్టర్లను బదిలీ చేసింది. తాజాగా మిగిలిపోయిన కలెక్టర్లను ఆయా స్థానాలకు బదిలీలు చేసింది. ఇందులోభాగంగా కడప కలెక్టర్‌గా లోతేటి శివ శంకర్‌ రానున్నారు. ఈయన బాధ్యతల నిర్వహణలో తనదైన ముద్రవేసినట్లు తెలుస్తోంది. బుధవారం సాయంత్రం లోపు కలెక్టర్‌ కలెక్టర్‌గా బాద్యతలు తీసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే తరహాలో అన్నమయ్య జిల్లా కలెక్టర్‌ అభిషిక్త్‌కిషోర్‌ స్థానంలో చామ కూరి శ్రీధర్‌ను బదిలీ చేసింది. ఈయన సైతం సత్వరమే కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడి నుంచి బదిలీపై వెళ్తున్న కలెక్టర్‌ అభిషిక్త్‌కిషోర్‌ 2024 జవనరి 31న కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆర్నెళ్లలోపే బదిలీ కావడం గమనార్హం. లోతేటి శివశంకర్‌ సేవలు గుంటూరు జిల్లా నుంచి విభజిత జిల్లా పల్నాడుకు ప్రథమ కలెక్టర్‌గా జయప్రధంగా విధులు నిర్వహించిన ఘతనను సొంతం చేసుకున్నారు. రెండేళ్ల వ్యవధిలోనే తనదైన శైలిలో ఎన్నో వినూత్న కార్యక్రమాలతో కూడిన సేవలందించారనే పేరు పొందారు. ఇందులో మచ్చుకు కొన్నింటిని ప్రస్తావించుకోవాల్సి ఉంది. ప్రతి సోమవారం ప్రజా సమస్యల కోసం వచ్చిన అర్జీదారులకు ఉచిత భోజన సదుపాయం కల్పించడం మొదలుకుని ఆయా జిల్లాల ప్రత్యేకత ఆధారంగా సాంస్కృతిక కార్యకలాపాలకు ప్రాధాన్యత ఇవ్వడం, నెల నెలా సాహిత్య మేళా, అంథుల కోసం ప్రత్యేక కార్యక్రమం, స్వాతంత్య్ర సమరయోధులు, బిఆర్‌ అంబేద్కర్‌ వంటి స్వాతంత్య్ర పోరాట యోధుల చిత్రాలు, ఇతర గొప్ప గొప్ప ఛాయాచిత్ర ప్రదర్శనలను ప్రోత్సహించడం, విద్య ఉపాధి రంగాలలో నవోదయం, రైతుకు వం దనం, టెన్త్‌ టాపర్లకు అభినందన, ఏ డే విత్‌ కలెక్టర్‌ పేరిట విద్యా ర్థులతో మమేకం కావడం, గ్రామోదయం, నగరోదయం, కాఫీ విత్‌ క్లాప్‌మిత్ర, మిషన్‌ శోభకృత్‌, సంక్రాంతి సంబరాలు, ఆడపిల్లల్లో రక్త హీనతను అధిగమించడానికి ఉద్దేశించిన బంగారుతల్లి 2.0 వంటి కార్యక్రమాలను జయప్రదంగా అమలు చేయడంతో ఐఎస్‌ఓ 9001 గుర్తింపు లభించింది. దీనికితోడు చేపట్టిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ సామాన్యులతో మమేకమై ప్రజా కలెక్టర్‌గా మన్న నలు పొందడం గమనార్హం.

➡️