తుగ్గలిని కరువు మండలంగా ప్రకటించాలి : అఖిలపక్ష నేతలు

Dec 19,2023 15:42 #Kurnool
  • 23న ప్రభుత్వ కార్యాలయాలకు తాళాలు
  • 24 గంటలు రోడ్లు దిబ్బంధం..

ప్రజాశక్తి-తుగ్గలి(కర్నూలు) : తుగ్గలిని మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని కోరుతూ ఈనెల 23వ తేదీన మండల కేంద్రమైన తుగ్గలిలో ఉండే అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు తాళాలు వేసి మంత్రాలయం – బెంగళూరు, గుంతకల్‌ – తుగ్గలి రహదారులను 24 గంటలు దిబ్బంధం చేస్తున్నట్లు అఖిలపక్ష నాయకులు మంగళవారం వెల్లడించారు. ఈ సందర్బంగా తుగ్గలి తహశీల్దార్‌ కార్యాలయం ఆవరణంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాజీ జడ్పీ కో ఆప్షన్‌ సభ్యులు నబి రసూల్‌, టిడిపి మండల అధ్యక్షులు తిరుపాల్‌ నాయుడు, సిపిఐ మండల కార్యదర్శి సుల్తాన్‌, సిపిఎం మండల కార్యదర్శి శ్రీ రాములు, బిజెపి మండల అధ్యక్షులు లక్ష్మణస్వామిలు మాట్లాడుతూ తుగ్గలి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని కోరుతూ గత నెల నుండి అనేక ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన ప్రభుత్వం స్పందించలేదన్నారు. అందువల్ల ఈనెల 23వ తేదీన మండల కేంద్రమైన తుగ్గలి లోనే అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు తాళాలు వేసి, రోడ్లపై వంట వార్పు చేసి, 24 గంటలు రోడ్లు దిబ్బంధం చేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమానికి మండలంలోని ప్రతి రైతు పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు..

➡️