ప్రతి సర్వేపై అవగాహన

Jul 2,2024 22:01
ప్రతి సర్వేపై అవగాహన

అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్న అధికారులుప్రతి సర్వేపై అవగాహనప్రజాశక్తి-ఉదయగిరి:సిబ్బంది చేపట్టే ప్రతి సర్వే అవగాహన కార్యక్రమాలు పకడ్బందీగా ఉండాలని ఆలసత్వం వహిస్తే అట్టి వారిపై చర్యలు తప్పవని గండిపాలెం వైద్యాధికారిని డాక్టర్‌ ఎం.శివ కల్పన పేర్కొన్నారు. మంగళవారం మండల పరిధిలోని గండిపాలెం పిహెచ్‌ సిలో ఆశా కార్యకర్తల డే సందర్భంగా ఆశ, ఎఎన్‌ఎం లకు, ఎం.ఎల్‌.హెచ్‌.పి లకు సాఫ్ట్‌ డయేరియా నివారణ డెంగీ వ్యతిరేక మాసోత్సవం పై ఒక్కరోజు శిక్షణలో పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎం.ఎల్‌.హెచ్‌.పి లు ఏ.ఎన్‌.ఎంలు,ఆశా కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది ప్రతి గృహాన్ని సందర్శించి 5సంవత్సరాల లోపు పిల్లలకు,డయేరియా లక్షణాలు ఉన్నాయా అనే విషయాలపై సర్వే నిర్వహించి, లక్షణాలు ఉన్న 5 సంవత్సరాలు లోపు పిల్లల గృహంలో 2 ఓ.ఆర్‌.ఎస్‌ పాకెట్లు,14 జింక్‌ మాత్రలు పంపిణీ చేయాలని సూచించారు. అనంతరం అప్పసముద్రం గ్రామంలో వైద్యాధికారిని వినీత ప్రజలకు అవగాహన కల్పించారు. ముందుగా స్టాఫ్‌ డయేరియా పోస్టర్లను విడుదల చేసి స్టాప్‌ డయేరియా డెంగీ వ్యతిరేక మాస ఉత్సవాలపై ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సి.హెచ్‌.ఓ, శివకుమారి, మలేరియా సబ్మిట్‌ అధికారి ఎస్‌.జి.నౌషద్‌ బాబు, ఆరోగ్య విద్యాధికారి కలసపాటి.వెంకటసుబ్బయ్య, ఆరోగ్య పర్యవేక్షకురాలు టి అంకమ్మ, ఎం ఎల్‌హెచ్‌పిలు, ఆరోగ్య సహాయకులు, ఎఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️