ఇళ్ల రిజిస్ట్రేషన్లు వేగవంతం : ఎంపిపి

Feb 8,2024 21:43

బొండపల్లి : జగనన్న లేఅవుట్ల్లలో ఉన్న ఇళ్ల నిర్మాణాల రిజిస్ట్రేషన్లను వేగవంతం చేయాలని ఎంపిపి చల్ల చలంనాయుడు కోరారు. గురువారం స్థానిక ఎంపిడిఒ కార్యాలయంలో ఎంపిడిఒ ఎస్‌.హరిహరరావు అధ్యక్షతన సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపిపి మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా జగనన్న ఇళ్ల నిర్మాణాలను చేపట్టిందన్నారు. నిర్మాణాలు పూర్తి అయిన వాటికి సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను చేపట్టిందని అన్నారు. వీలైనంత త్వరగా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను పూర్తి చేయాలని అయన కోరారు. వ్యవసాయ అధికారి మల్లికార్జున రావు మాట్లాడుతూ ఖరీఫ్‌లో 13,500 టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం కాగా, 10,156 టన్నులు రైతుల వద్ద నుండి సేకరించామని తెలిపారు. 90 శాతం ఇకెవైసి పూర్తి చేసినట్లు చెప్పారు. ధాన్యం దిగుబడి తక్కువ ఉన్న ఐదు గ్రామాలకు సంబంధించి రైతులకు రాయితీ కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని తెలిపారు. మండలంలో 17 సచివాలయాలకు 13 సచివాలయ భవనాలు ప్రారంభించామని పంచాయతీరాజ్‌ జెఇ కృష్ణమూర్తి తెలిపారు. మరో నాలుగు సచివాలయాల నిర్మాణాలు పూర్తి కావాల్సి ఉందని చెప్పారు. ఈ సమావేశంలో మండల ప్రత్యేక అధికారి దుర్గాప్రసాద్‌, తహశీల్దార్‌ పి.హరి, ఐసిడిఎస్‌ పిఒ ఉమాభారతి, ఎపిఎం సులోచన దేవి, ఎపిఒ బి.కృష్ణవేణి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు మెంటాడ : తాగునీటి ఎద్దడినివారణకు చర్యలు తీసుకోవాలని ఎంపిడిఒ లక్ష్మీభాయి సూచించారు. స్థ్థానిక ఎంపిడిఒ కార్యాలయంలో గురువారం ఎంపిడిఒ లక్ష్మీబాయి పంచాయతీ కార్యదర్శులు, అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ముందుగా గ్రామ, మండల స్థాయి అధికారులు చేపట్టిన పనులు, ప్రగతిని అడిగి తెలుసుకున్నారు. తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టాలని, గృహనిర్మాణంలో ప్రత్యేక శ్రద్ధ చూపించి నిర్మాణాలు వేగవంతం చేయాలని సూచించారు. గ్రామానికి అవసరమైన పనుల విషయంలో ప్రాధాన్యత బట్టి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కులగణన, ఆరోగ్యశ్రీ కార్డులు, తాగునీరు, పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. కార్యక్రమంలో ఇఒపిఆర్‌డి విమలకుమారి, జూనియర్‌ సహాయకులు సంతోష్‌ కుమార్‌, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

➡️