క్రీడల్లోనూ రాణించాలి

Mar 7,2024 20:10

ప్రజాశక్తి-విజయనగరంటౌన్‌ : విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో కూడా రాణించాలని రాష్ట్ర బాలల హక్కుల కమిషన్‌ చైర్మన్‌ కేసలి అప్పారావు, అసిస్టెంట్‌ కలెక్టర్‌ బి.ఎస్‌. వెంకట్‌ త్రివినాగ్‌ అన్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో జరిగిన నేషనల్‌ ఓపెన్‌ కరాటే డు ఛాంపియన్‌షిప్‌-2024లో జిల్లా క్రీడాకారులు సత్తాచాటి పతకాలు సాధించారు. వీరికి ఎ.బి చారిటబుల్‌ ట్రస్ట్‌, జైహనుమాన్‌ అశ్విని మార్షల్‌ ఆర్ట్స్‌ స్పోర్ట్స్‌ అకాడమీ, సుమన్‌ షాటోకాన్‌ స్పోర్ట్స్‌ కరాటే డు అకాడమీ ఆధ్వర్యంలో స్థానిక ప్రదీప్‌ నగర్‌లోని కరాటే అకాడమీలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పోటీల్లో గెలుపొందిన వారికి సర్టిఫికెట్లు పతకాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎబి చారిటబుల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ డాక్టర్‌ ఎం. ఎస్‌ స్వరూప్‌ సుమన్‌ షాతోకన్‌ పాల్గొన్నారు.

➡️