బకాయిలు చెల్లించాలని కోరుతూ 20న భారీ ప్రదర్శన

Feb 18,2024 20:48

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : ఐఆర్‌, డిఎ, జిపిఎఫ్‌ బకాయిలు చెల్లించాలని ఈ నెల 20న భారీ ప్రదర్శన చేపడుతున్నట్లు ఎపి జెఎసి జిల్లా కమిటీ వెల్లడించింది. జెడ్‌పి సమావేశ మందిరం నుంచి కలెక్టరేట్‌ వరకు జరిగే ర్యాలీలో జిల్లాలోని అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల సభ్యులు పాల్గొనాలని పిలుపునిచ్చింది. ఆదివారం స్థానిక ఎపిఎన్‌జిఒ అసోసియేషన్‌ భవనంలో ఎపిజెఎసి సమావేశం నిర్వహించారు. డిమాండ్ల పరిష్కారం కోసం చేస్తున్న ఉద్యమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నాయకులు కోరారు. సమావేశంలో ఎపి జెఎసి జిల్లా చైర్మన్‌ జివిఆర్‌ఎస్‌ కిశోర్‌, కార్యదర్శి సురేష్‌, రాష్ట్ర ఉపాధ్యక్షులు డివి రమణ, జెఎసి నాయకులు ప్రభూజి, మురళి, ఆనంద్‌కుమార్‌, కెబి శ్రీనివాసరావు, శ్రీధర్‌బాబు, పెద్దింటి అప్పారావు, నారాయణ, శ్రీవిద్య, ఆదిలక్ష్మి, రాజు, జెఎవిఆర్‌కె ఈశ్వరరావు, రమేష్‌చంద్ర పట్నాయక్‌, డి.ఈశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

➡️