2,85,675 మందికి పింఛను లబ్ధి

Jan 3,2024 21:13

ప్రజాశక్తి-విజయనగరం : జిల్లా వ్యాప్తంగా 2,85,675 మందికి రూ.3 వేల వైఎస్‌ఆర్‌ పింఛను కానుక లబ్ధి చేకూరుతుందని, రూ.83.54 కోట్లు అందిస్తున్నామని జెడ్‌పి చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం వైఎస్‌ఆర్‌ పింఛను కానుక ద్వారా పెంచిన రూ.3 వేలు అందించే కార్యక్రమంలో భాగంగా కాకినాడ రంగరాయ వైద్య కళాశాల మైదానంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. లైవ్‌లో స్థానిక కలెక్టరేట్‌ ఆడిటోరియం నుంచి జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి, డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్ర స్వామి, మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు పాల్గొని వీక్షించారు. అనంతరం లబ్దిదారులకు మెగా చెక్కును, సిఎం లేఖను, పింఛనును అందజేశారు. కార్యక్రమంలో డిఆర్‌డిఎ పీడీ కళ్యాణ చక్రవర్తి, జిఎస్‌డబ్ల్యు జిల్లా కో ఆర్డినేటర్‌ నిర్మల దేవి, మెప్మా పీడీ సుధాకర్‌, లబ్దిదారులు పాల్గొన్నారు.

➡️