డిప్యూటి స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి ఇంటిని ముట్టడించిన అంగన్వాడీలు

Dec 27,2023 16:48 #Vizianagaram
anganwadi strike 16th day vzm mla

అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేయాలని ముఖ్యమంత్రి లేఖ రాసిన కోలగట్ల 
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ నిర్వహిస్తున్న సమ్మె బుధవారం 16వ రోజుకు చేరుకుంది. దీనిలో భాగంగానే విజయనగరం లో స్థానిక బాలాజీ జంక్షన్ నుంచి డిప్యూటి స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి ఇంటి కి భారీ ర్యాలగా వెళ్లి ఇంటిని ముట్టడించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎపి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెలపర్సే యునియన్ జిల్లా అధ్యక్షులు బి పైడిరాజు, సి ఐ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి కె సురేష్ లు మాట్లాడుతూ అంగన్వాడీలు మాట్లాడుతూ 16 రోజులైనా అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు సమ్మె కొనసాగిస్తామని హెచ్చరించారు. అనంతరం 11 డిమాండ్ల తో కూడిన వినతపత్రాన్ని అందచేశారు. స్పందించిన డిప్యూటి స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి వెంటనే ముఖ్యమంత్రి కి అంగనవాడీలు సమస్యలు పరిష్కారం చేయాలని లేఖ రాసి ఫ్యాక్స్ లో పంపించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ఇంటి వద్ద పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. కార్యక్రమంలో సి ఐ టి యు నాయకులు బి.రమణ, అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు పాల్గొన్నారు.

➡️