తేగేవరకు లాగొద్దు

Jan 12,2024 14:08 #Vizianagaram
anganwadi workers strike 32nd day in vzm

ప్రజాశక్తి-విజయనగరం : రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అంగన్వాడీలకు కనీస వేతనాలు అమలు చేసి, ఇతర సౌకర్యాలు కల్పించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి సిహెచ్.రామ్మూర్తి నాయుడు రాజాం తాసిల్దార్ కార్యాలయం వద్ద జరుగుతున్న 32వ రోజు రిలే నిరాహార దీక్షలో డిమాండ్ చేశారు. రామ్మూర్తి నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలు చేస్తున్న న్యాయమైన పోరాటంపై ముందు పట్టుదలతో కక్ష సాధింపు దూరంలో వ్యవహరించడం సరైనది కాదని, తేగే వరకు లాక్కుండా సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని అమలు చేయమని అడిగితే ఈ రకంగా సమ్మెను విచ్ఛిన్నం చేయాలని ఆలోచన సరైంది కాదని, ప్రభుత్వం ఎన్ని రకాల నిర్బంధాల్ని, బెదిరింపుల్ని చేస్తున్న వాటిని ఎదుర్కొని అంగన్వాడీలు ఈరోజు సమ్మెలో నిలబడడం గర్వకారణమని ప్రభుత్వం గుర్తించి వెంటనే సమస్యల పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి పిచుక మీద బ్రహ్మాస్త్రం వేసినట్లుగా అంగన్వాడీపై ఎస్మా ప్రయోగించడం కూడా అంతేనని, గత 30-40 ఏళ్లుగా ఐసిడిఎస్ లో సేవలందిస్తున్న అంగనవాడిలకు కనీస వేతనాలు గాని ఉద్యోగ భద్రత గాని గ్రాడ్యుటి గాని ఏ ఒక్క సౌకర్యాలు అమలు చేయకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దోపిడీ చేస్తున్నాయని అన్నారు. ప్రభుత్వం తెగేదాకా లాగితే రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వానికి నష్టం జరుగుతుందని దీన్ని గమనంలో ఉంచుకోవాలని జగన్మోహన్ రెడ్డికి హితవ్ పలికారు.

1) అంగన్వాడీ ఉద్యోగులకు కనీస వేతనాలు రూ.26 వేలు ఇవ్వాలి. ముఖ్యమంత్రి హామి ఇచ్చిన విధంగా తెలంగాణా కన్న అదనంగా వేతనాలు పెంచాలి.

2) సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీలకు మన రాష్ట్రంలో కూడా గ్రాడ్యూటీ అమలు చేయాలి.

3) రాష్ట్రంలో ఉన్నటువంటి మినీ సెంటర్లన్ని తక్షణమే మెయిన్ సెంటర్లుగా మార్చాలి. మినీ వర్కర్లకు ప్రమోషన్లు ఇవ్వాలి.

4) రిటైర్మెంట్ బెపిఫిట్ 5 లక్షలకు పెంచాలి. ఆఖరి వేతనంలో 50% పెన్షన్ ఇవ్వాలి.

5) హెల్పర్ల ప్రమోషన్లో నిర్ధిష్టమైన నిబంధనలు రూపొందించాలి. రాజకీయజోక్యం అరికట్టాలి.

6) సర్వీసులో ఉండి చనిపోయిన అంగన్వాడీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. 10 లక్షలు బీమా అమలు చెయ్యాలి.

7) వేతనంతో కూడిన మెడికల్ లీవ్ సౌకర్యం ఇవ్వాలి.

8) లబ్దిదారులకు నాణ్యమైన సరుకులు ఇవ్వాలి. ఎస్ఆర్ఎస్ రద్దుచెయ్యాలి. ప్రీస్కూల్ బలోపేతం చెయ్యాలి.

9) ఎస్ఆర్ఎస్ మరియు వివిధ రకాల యాప్ లను రద్దు చేసి ఒక యాప్ ద్వారా విధులు నిర్వహించే విధంగా చేయాలి.

10) వైఎస్సార్ సంపూర్ణ పోషణ మెనూ చార్జీలు పెంచాలి. గ్యాసును ప్రభుత్వమే సరఫరా చెయ్యాలి.

11) పెండింగ్లో ఉన్న సెంటర్అద్దెలు, 2017 నుండి టిఎ బిల్లులు, ఇతర బకాయిలు వెంటనే ఇవ్వాలి.
12) పెండింగ్లో ఉన్న గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్ట్ 164ను వెంటనే భర్తీ చేయాలి. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు ధవలేశ్వరి, సత్యవతి, అనురాధ, శ్రీదేవి, ప్రమీల, లక్ష్మి, దమయంతి , రాంబాయి ,కాంత, జ్యోతి, మొదలగువారు పాల్గొన్నారు.

➡️