మెరుగైన వైద్యసేవలు అందించాలి

Jul 1,2024 21:01

ప్రజాశక్తి-బొబ్బిలి : వైద్యులు నాణ్యమైన వైద్యసేవలు అంది ంచాలని రోటరీ డిస్ట్రిక్ట్‌చైర్మన్‌ జెసి రాజు అన్నారు. సోమవారం వైద్యుల దినోత్సవాన్ని పురస్క రించుకొని వైద్యులను సత్కరించే కార్యక్రమాన్ని క్లబ్‌ ప్రెసిడెంట్‌ శ్రీనివాసన్‌ కార్యదర్శి ప్రవీణ్‌ కుమార్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులకు పట్టు కండువాలు వేసి పుష్ప గుచ్చాలను అందించి శుభాకాంక్షలు తెలిపారు. సత్కరించిన వారిలో డాక్టర్‌ రామ్‌నరేష్‌, కంటివైద్య నిపుణులు డాక్టర్‌ అప్పారావు, భారతి హాస్పిటల్‌ వైద్యులు డాక్టర్‌ దివాకర్‌ బాబు, డాక్టర్‌ అభినరు, డాక్టర్‌ హరి జగన్‌, డాక్టర్‌ రామ్‌ కుమార్‌, డాక్టర్‌ మౌనిక, డాక్టర్‌ శ్రీకాంత్‌ ఉన్నారు. రక్తదాన శిబిరం విజయవంతం రోటరీ నూతన సంవత్సరం ప్రారంభం, వైద్యుల దినోత్సవం సందర్భంగా రోటరీ ఆధ్వర్యంలో ఎన్‌అర్‌ఐ హాస్పిటల్‌ లో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. గోకుల్‌ ఫార్మసీ విద్యార్థులు, మాతృభూమి సేవాసంఘం రోటరీ సభ్యులు రక్త దానంలో పాల్గొన్నారు. శృంగవరపుకోట : జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా మండలంలోని భవాని నగర్‌ వద్దనున్న డాక్టర్‌ వరలక్ష్మి పబ్లిక్‌ స్కూల్‌ విద్యార్థులు ఏరియా ఆస్పత్రి ఇన్‌ఛార్జి ఉషారాణిని సత్కరించారు. వైద్యులకు, ఆసుపత్రి సిబ్బందికి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా డాక్టర్‌ ఉషారాణి మాట్లాడుతూ విద్యార్థులు చిన్న వయసు నుండే తమ జీవిత లక్ష్యాలను ఏర్పరుచుకొని దానికి అనుగుణంగా సరైన ప్రణాళికా బద్ధంగా అడుగులు వేయాలని సూచించారు. సమాజానికి సేవ చేసిన వైద్యుల గురించి విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో విద్యార్థులు వారు స్వయంగా తయారు చేసిన గ్రీటింగ్‌ కార్డులను వైద్యులకు అందించారు.ఎస్‌టి కమిషన్‌ కార్యాలయంలో డాక్టర్స్‌ డే విజయనగరం : జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా ఎస్‌టి కమిషన్‌ క్యాంప్‌ కార్యాలయంలో డాక్టర్స్‌ డే వేడుకలు జరిగాయి.ఈ సందర్భంగా భారత రత్న డాక్టర్‌ బిసి రారు చిత్రపటానికి కమిషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ డివిజి శంకర్రావు పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యాలయ సిబ్బంది, పలువురు ఆదివాసీ సంఘాల నాయకులు హాజరై డాక్టర్‌ శంకరరావుకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన ఎయిమ్స్‌ మంగళగిరి పిజి విద్యార్థి డాక్టర్‌ గాయత్రితో పాటు కేక్‌కట్‌ చేసి అందరికీ ధన్యవాదాలు తెలిపారు.

➡️