నేడు చంద్రబాబు రాక

Apr 21,2024 21:43

ప్రజాశక్తి-విజయనగరం కోట : టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మూడు రోజులు పాటు జిల్లాలో పర్యటించను న్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం సాయంత్రం శృంగవరపుకోటలో రోడ్డుషో నిర్వహిస్తారు. శ్రీశైలం నుంచి నేరుగా సాయంత్రం 6గంలటలకు ప్రత్యేక హెలికాప్టర్‌లో ఎస్‌.కోట చేరుకుంటారు. రోడ్డు షో అనంతరం రాత్రి అక్కడే బస చేస్తారు. 23న ఉదయం 11గంలటలకు గజపతినగరం నియోజకవర్గం బొండపల్లిలో మహిళా ప్రజాగళం సభలో పాల్గొంటారు. ఇందుకు సంబంధించి జాతీయరహదారి పక్కన మైదానంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదివారం బొబ్బిలి డిఎస్‌పి శ్రీనివాసరావు, సిఐ ప్రభాకర్‌, ఎస్‌ఐలు లక్ష్మణరావు, మహేష్‌ పరిశీలించారు. చంద్రబాబు ఆరోజు రాత్రికి అక్కడే బస చేస్తారు. 24న మధ్యాహ్నం 3గంటలకు నెల్లిమర్ల నియోజకవర్గం రామతీర్థంలోను, అదే రోజు సాయంత్రం విజయనగరంలో జరిగే సభలో చంద్రబాబుతో పాటు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పాల్గొంటారు.

➡️