విజయనగరంలో క్రేడాయ్ నూతన భవనం

May 26,2024 12:01 #Vizianagaram

ప్రారంబించిన క్రేడాయ్ జాతీయ పూర్వ అధ్యక్షులు శేఖరరెడ్డి
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : స్థానిక ధర్మపురి వసంత విహార్ లే అవుట్ లో నూతనంగా నిర్మించిన క్రేడాయ్ నూతన భవనాన్ని ఆదివారం నాడు క్రేడాయ్ నేషనల్ మాజీ అధ్యక్షులు సి.శేఖరరెడ్డి, జాతీయ సహయ కార్యదర్శి బి. రాజా శ్రీనివాస్, రాష్ర్ట చైర్మన్ ఏ.శివారెడ్డి, అధ్యక్షులు ఎన్ వి రమణారావు, ప్రధాన కార్యదర్శి పాయల శ్రీనివాసరావులు రిబ్బన్ కట్ చేసి ప్రారంబించారు. అనంతరం వారు మాట్లాడుతూ క్రెడాయ్ విజయనగరం చరిత్రలో మంచి రోజుగా భావిస్తున్నామన్నారు. ఏదైతే మా కళ స్వంత భవనం ఉండాలని దానిని నెరవేర్చడం శుభపరిణామం అన్నారు. రెగ్యులర్గా సమావేశాలు పెట్టీ ,స్కిల్ డెవలప్మెంట్ మీద,నిర్మాణ రంగంలో వస్తున్న మార్పులపై చేర్చేందుకు ఒక వేదిక అవసరం. ఆ దిశగా నూతన భవనాన్ని నిర్మించిందన్నందుకు జిల్లా సభ్యులకు అభినందనలు తెలిపారు.దేశంలో 25 వేలు మంది సభ్యులతో ఉంది. ఉద్యోగ కల్పనలో క్రేడాయ్ రెండో స్థానం లో ఉందన్నారు. 250 పరిశ్రమలు మాపై ఆధారపడి ఉన్నాయన్నారు. వినియోగదారులకు, ప్రజలకు ఉపయోగపడే విధంగా మా క్రీడాయ్ పని చేస్తుందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు చంద్రబోస్, జిల్లా చైర్మన్ వి.పార్థసారథి, జిల్లా మాజీ అధ్యక్షులు, ఫౌండర్ సూర్యనారాయణ రాజు, కె.రాజశేఖర్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

 

➡️