ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి

Mar 24,2024 09:29 #Vizianagaram

అసిస్టెంట్ కమీషనర్ తిరుమలరావు
అవగాహన ర్యాలీ
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరు ఓటును వినియోగించుకోవాలని నగరపాలక సంస్థ సహాయ కమిషనర్ సిహెచ్ తిరుమల రావు పిలుపునిచ్చారు. ఆదివారం ఓటు పై ప్రజలందరికీ ఓటు యొక్క ఆవశ్యకత, విశిష్టత గూర్చి అవగాహన కల్పించేందుకు ర్యాలీ చేపట్టారు. విజ్జి స్టేడియంలో వరకు ర్యాలీ నిర్వహించి, నగరపాలక సంస్థ ఉద్యోగులు సిబ్బంది మానవహారంగా ఏర్పడి ఓటు యొక్క ప్రాధాన్యత గూర్చి చైతన్య పరిచారు. ఈ సందర్భంగా సహాయ కమిషనర్ తిరుమలరావు మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో ఓటు వజ్రాయుధం ఉంటిదని అన్నారు. ఓటుకు మించిన ఆయుధం వేరొకటి లేదని అన్నారు. ప్రజలందరూ తప్పనిసరిగా పోలింగ్ రోజున తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజారోగ్య అధికారి డాక్టర్ కొండపల్లి సాంబమూర్తి, పారిశుధ్య పర్యవేక్షకులు బాలకృష్ణ, సలీం రాజు, రామకృష్ణ, అంజిబాబు తదితరులు పాల్గొన్నారు.

➡️