చేపల విక్రయాలపై ఆకస్మిక దాడులు

Jun 16,2024 21:40

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : నగరంలో ఆదివారం పలు కూడళ్ల వద్ద చేపలు, చికెన్‌, మటన్‌ విక్రయాలపై లీగల్‌ మెట్రాలజీ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. చట్టవిరుద్ధమైన తూనిక రాళ్లు వినియోగించి వినియోగదారులను మోసగిస్తున్న ముగ్గురు చేపల వర్తకులపై కేసులు నమోదు చేశారు. ఇంకోసారి గానీ ఇటువంటి మోసాలకు పాల్పడితే భారీగా అపరాధ విధిస్తామని, క్రిమినల్‌ కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని ఇన్‌స్పెక్టర్‌ ఎం.దామోదర నాయుడు హెచ్చరించారు. వినియోగదారులు కూడా మోసాల పట్ల అవగాహన కలిగి ఉండాలని సూచించారు. అందుకోసం నెలలో రెండు చోట్ల అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. తూకంలో, కొలతల్లో ఎక్కడైనా మోసాలు గుర్తిస్తే తమ శాఖకు తెలియజేయాలని కోరారు.

➡️