సుపరిపాలన – డ్రగ్స్ పాలన 

Feb 3,2024 13:06 #Vizianagaram
tdp leaders on ycp drugs politics

ప్రజాశక్తి-విజయనగరం కోట : తెలుగు దేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సుపరిపాలన అందించారు. ఈ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలన డ్రగ్స్ పాలన సాగుతోందని విజయనగరం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ అదితి విజయలక్ష్మి గజపతిరాజు అన్నారు. శనివారం నాడు స్థానిక అశోక్ బంగ్లా టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో యువత డ్రగ్స్ కు బానిసలు మారిపోతున్నాయని మండిపడ్డారు. డ్రగ్స్కు బానిసైతే హత్యలు, దొంగతనాలు పెరిగిపోతాయన్నారు. ఆనాడు చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్న సమయంలో గంజాయికి బదులుగా కాఫీ తోటలు సాగు కు సహాయసహకారాలు అందించారన్నారు. స్కూల్స్ లో కూడా గంజాయి విచ్చలవిడిగా దొరుకుతుందన్నారు. పిల్లల తల్లిదండ్రులు భయపడుతున్నారు బడికి పంపాలంటే, రాష్ట్రంలో యువతకు భవిష్యత్తు ఉండాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రిని చేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవిపి రాజు మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ వర్గాన్ని పట్టించుకోకుండా సైకో ముఖ్యమంత్రి  ఉన్నారన్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలను పూర్తిగా నెరవేర్చడంలో జగన్మోహన్ రెడ్డి విఫలమయ్యారని మండిపడ్డారు. జనవరిలో ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ తీస్తామని చెప్పి ఒక్క జాబ్ క్యాలెండర్ తీయలేదు అన్నారు. ఈ ఐదు సంవత్సరాలలో డీఎస్సీ నోటిఫికేషన్ ఊసే లేదన్నారు. నిన్న కాక మొన్న ప్రకటించిన డిస్సీ ఎన్నికల డీఎస్సీ అన్నారు. అందులో 6వేల ఉద్యోగాలు ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. నిరుద్యోగులు చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఈకారికైరమంలో పట్టణ అధ్యక్షులు ప్రసాదుల లక్ష్మీ వరప్రసాద్, విజయనగరం మండల పార్టీ అధ్యక్షులు బొద్దుల నర్సింగరావు, కార్యదర్శి గంటా పోలినాయుడు, కార్యాలయ కార్యదర్శి రాజేష్ బాబు, కనకాల మురళీమోహన్, కంది మురళి నాయుడు, నియోజకవర్గ టిడిపి నాయకులు పాల్గొన్నారు.

➡️