సౌత్ జోన్ కి సెలెక్ట్ అయిన విజయనగరం క్రీడాకారుడు

Dec 16,2023 16:37 #Vizianagaram
vzm player select to south zone

ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : జిల్లాకు చెందిన వజ్రాపు పవన్ కుమార్ ప్రస్తుతం ఎంవిజిఆర్ కాలేజీలో రెండవ ఏడాది చదువుతున్నాడు. 15 -12 -2023 తేదీన రాజాం జి ఎం ఆర్ కాలేజీలో నిర్వహించిన ఇంటర్ యూనివర్సిటీ సెలెక్షన్ లో ప్రతిభ కనిపించాడు. సౌత్ జోన్ కి అర్హత సాధించాడు. ఇంటర్ యూనివర్సిటీ సౌత్ జోన్ 19 -12- 2023న చెన్నైలో నిర్వహించే టోర్నమెంట్లో అర్హత స్థాయించాడు. వజ్రపు పవన్ కుమార్ ని వి సి బి ఎ ప్రెసిడెంట్ డా.వి ఎస్ ప్రసాద్, సెక్రెటరీ ఎన్. సురేష్, వై.కుమార్ మరియు విసిబిఏ సభ్యులందరూ అభినందించారు. వారి తల్లిదండ్రులు కూడా చాలా ఆనందపడ్డారు. తల్లి అరుణ, తండ్రి కుమార్ చాలా సంతోషపడ్డారు. అతి తక్కువ సమయంలో ఇంత మంచి ప్రతిభ తెప్పించిన కోచ్ జి శ్రీనివాసరావుని అభినందించారు. ఇలాంటి మరిన్ని విజయాలు సాధించాలని వి సి వి ఏ సభ్యులందరూ పవన్ తో మాట్లాడారు. పవన్ కుమార్ జె ఎన్ టీ యులో సెలక్ట్ అయ్యారని జి.శ్రీనివాసరావు చెప్పారు

➡️