మహాసభ గోడ పత్రిక విడుదల

Feb 5,2024 12:34 #Visakha
apmrs state conferecne poster release

ప్రజాశక్తి-విశాఖ : ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్ సర్ప్రైజెస్ యూనియన్ అఖిల భారత సభలు విజయవాడలో ఈనెల 7 తేదీ నుంచి 9వ తేదీ వరకు,  రాష్ట్ర మహాసభలు 9-11 తేదీలలో జరగనున్నాయి.  ఈ సందర్భంగా విశాఖలో వాల్ పోస్టర్ని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా సభ్యులు శ్రవంత్ జిల్లా అధ్యక్షులు సుధాకర్  మరియు జిల్లా నాయకులు మహేష్ సన్యాసిరావులు పాల్గొన్నారు. ఈ మహాసభల్లో ప్రధానమైన ఉద్దేశ్యం మందులు ధరల తగ్గించాలని, నకిలీ నాసిరక మందులు అరికట్టాలని, నల్లబచారుల మందులు అమ్మకాలు ఆపాలని, ఆన్లైన్లో మెడిసిన్ సెల్లింగ్ ఆపాలని, రాబోయే మహాసభల వరకు దీనిలో కార్యాచరణ రచించి వీటిపైన తీర్మానాలను ప్రవేశపెట్టనున్నారు.  వీటి అమలుకై  కార్యక్రమాలను  రూపోందించినున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పోస్టర్స్ ప్రతి జిల్లాలోనూ విడుదల చేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.  సమిష్టి కృషి వల్ల 354 మందుల ధరలు అదుపులోకి వచ్చాయని, షెడ్యూల్ హెచ్ లో ఉన్న డ్రగ్స్ ఆన్లైన్లో అమ్మకూడదని కోర్టు తీర్పు ఇవ్వటం జరిగిందని పేర్కొన్నారు. మందుల రంగంలో ప్రభుత్వ రంగ కంపెనీలను బలోపేతం చేయాలని, గవర్నమెంట్ హాస్పిటల్స్ ద్వారా ప్రజలందరి కోసం సంపూర్ణమైన ఆరోగ్యం కల్పించాలని డిమాండ్ చేశారు.

➡️