విశాఖ ఎస్.బి.ఐ ఎదుట సిపిఎం నిరసన

Mar 11,2024 13:18 #Visakha

ప్రజాశక్తి-విశాఖ కలెక్టరేట్ :  ఎన్నికల బాండ్ల వివరాలను తక్షణం ఎస్.బి.ఐ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ, సోమవారం జైలు రోడ్డు జంక్షన్ లోని ఎస్బిఐ మెయిన్ బ్రాంచ్ ఎదుట సిపిఎం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గు నాయుడు మాట్లాడుతూ, సుప్రీంకోర్టు ఆదేశం మేరకు ఎస్ బిఐ ఎన్నికల బాండ్ల వివరాలను ప్రకటించవలసి ఉన్నప్పటికీ, మోడీ ప్రభుత్వానికి తలోగ్గి తాత్సారం చేస్తుందని ఆరోపించారు. సుప్రీంకోర్టు ఆదేశాలను ఎస్.బి.ఐ అధికారులు పాటించకుండా,నిర్లక్ష్యంగా వ్యవహరించడం శోచనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు పి.మణి, ఎం.సుబ్బారావు, వి. కృష్ణారావు తోపాటు జివిఎన్ చలపతి, కెవిపి చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.

➡️