బాలికకు ఆర్థిక సాయం

Jun 16,2024 00:30 #EAS Sharma, #help
ఆర్థిక సాయం అందజేస్తున్న ప్రతినిధి

ప్రజాశక్తి – విశాఖ కలెక్టరేట్‌ :

మంచి మార్కులతో పదో తరగతి ఉత్తీర్ణురాలై కాలేజీలో అడుగు పెట్టే సమయంలో మత్స్యకార కుటుంబానికి చెందిన దగులుపిల్లి భార్గవి మల్టీ ఆర్గాన్‌ ఫెయిల్యూర్‌తో హాస్పిటల్‌లో చేరి చావుబతుకుల మధ్య దయనీయ స్థితిలో ఉందన్న విషయం తెలిసి రిటైర్డ్‌ ఐఎఎస్‌ అధికారి ఇఎఎస్‌.శర్మ స్పందించారు. రూ.30 వేలు ఆర్థిక సాయం అందించారు. అలాగే తన మిత్ర బృందం సహకారంతో మరో రూ.29 వేలు సమకూర్చారు. ఆ మొత్తం రూ.59 వేలను జోడుగుళ్లపాలెంలో ఉంటున్న భార్గవి తల్లిదండ్రులు కొండమ్మ, అప్పారావు దంపతులకు అందించినట్లు ఎయుటిడి సంస్థ కార్యదర్శి ప్రగడ వాసు మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా జోడుగుళ్లపాలెం ప్రజలు ఇఎఎస్‌.శర్మకు ధన్యవాదాలు తెలిపారు.

 

➡️