నమ్మి మోసపోయాం.. మా సత్తా చూపిస్తాం : యూటిఎఫ్‌

Feb 4,2024 16:47 #Kurnool
  • ఓట్‌ ఫర్‌ ఓపియస్‌ పోస్టర్‌ ఆవిష్కరణ

ప్రజాశక్తి-కర్నూలు కలెక్టరేట్ : పాత పెన్షన్‌ తీసుకొచ్చి ఉద్యోగుల భవిష్యత్తుకు గ్యారెంటీ ఇచ్చే పార్టీలకే ఉద్యోగ ఉపాధ్యాయుల ఓట్లు వేస్తామనని ఇప్పటివరకు ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేదని ఈ ప్రభుత్వాన్ని నమ్మి మోసపోయామని ఇక తమ సత్తా చూపిస్తామని యూటిఎఫ్‌ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రవికుమార్ నవీన్ పాటి ప్రకటించారు. ఆదివారం ఉదయం కర్నూలు స్టేడియంలో మార్నింగ్‌ వాక్‌ చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులను కలసి వోట్‌ ఫర్‌ ఓపియస్‌ పోస్టర్లను కర్నూలు యూటిఎఫ్‌ నాయకులు ఆవిష్కరించారు. జిల్లా అధ్యక్షప్రధానకార్యదర్శులు యూఆర్‌ఏ రవికుమార్‌, బంగారు నవీన్‌ పాటిల ఆధ్వర్యంలో వాకింగ్‌ చేస్తున్న వారికి పోస్టర్‌లను చూపించి సందేశాలు ఇచ్చి ప్రభుత్వం ఇదివరకు ఎలా మోసం చేసింది, ఇప్పుడెలా మోసం చేస్తున్నదో వివరించారు. ఉద్యమాలు చేస్తే పోలీసులెలా నిర్భందిస్తున్న విషయాలను చెప్పి ఈ రాష్ట్రంలో ప్రభుత్వ తీరును ప్రశ్నించలేని స్థితి వచ్చిందని వివరించారు. ఉద్యోగుల పట్ల ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహిరిస్తున్నదనే విషయాన్ని నాయకులు చెప్పారు. పాతపెన్షన్‌ విధానాన్ని అధికారం వచ్చి వారం రోజుల్లో తెస్తానని చెప్పిన ముఖ్యమంత్రి మాటమార్చి సీపియస్‌ ఉద్యోగులను నిలువునా ముంచాడన్నారు. పెండిరగ్‌ బిల్లులు, అరియర్స్‌ మాత్రమే కాకుండా నెలజీతాలు కూడా ఇవ్వకుండా వేధిస్తున్నారని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పోస్టర్‌ ఆవిష్కరణకు వాకింగ్‌ చేస్తున్న ఉద్యోగులు, న్యాయవాదులు, వైద్యులు, వివిధరంగాలకు చెందిన ప్రముఖుల నుండి మద్దతు లభించింది. స్వచ్చందంగా హాజరై ఉపాధ్యాయులు చేస్తున్న న్యాయపోరాటానికి సంఫీుభావం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సాహితీస్రవంతి రాష్ట్ర అధ్యక్షులు కెంగార మోహన్‌, ఆలిండియా లాయర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు కెంగార కుమార్‌, తెలంగాణ రాష్ట్రం గద్వాల జిల్లా యూటిఎఫ్‌ నాయకులు రమేష్‌, భరత్‌, రవీంద్రా రెడ్డి, యూటిఎఫ్‌ జిల్లా నాయకులు ప్రసాదరెడ్డి, దుర్గాప్రసాద్‌, ఐలు జిల్లా నాయకులు లక్ష్మన్‌, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.

➡️