అధికారంలోకి రాగానే రాజోలిని పూర్తి చేస్తాం

ప్రజాశక్తి-చాపాడు/మైదుకూరు/కలికిరిగత ఎన్నికల్లో రాజోలి ఆనకట్టను నిర్మిస్తామని హామీ ఇచ్చామని అయితే కరోనా, ఇతర ఆర్థిక పరిస్థితుల కారణంగా నిర్మాణం చేపట్టలేకపోయామని వైసిపి అధినేత వైఎస్‌ .జగన్మోహన్‌రెడ్డి ప్రజలకు సంజాయిషీ ఇచ్చారు. మంగళవారం వైఎస్‌ఆర్‌ జిల్లా మైదుకూరు, అన్నమయ్య జిల్లా కలికిరి ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సిద్ధం సభలకు హాజరై మాట్లాడుతూ మైదుకూరు నియోజ కవర్గ చిరకాల స్వప్నమైన రాజోలి ప్రాజెక్టు నిర్మించలేకపోయినందుకు బాధగా ఉంద న్నారు. నాలుగేళ్ల కాలంలో సకాలంలో వర్షాలు పడడంతో సకాలంలో నీటిని విడుదల చేసి రైతులు పంటలు పండిం చుకునే అవకాశం ఏర్పడిందని తద్వారా రాజోలి ఆనకట్ట ప్రాముఖ్యత కనిపిం చలేదన్నారు. ఈ ఏడాది తీవ్ర వర్షాభావాల పరిస్థితుల కారణంగా రాజోలి ఆనకట్ట ఆవశ్యకత ప్రతి ఒక్కరికి అర్థమయిందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కరోనా ఇబ్బందులు కొన్ని చెప్పలేని కారణాలతో భూమిపూజ చేపట్టినప్పటికీ రాజోలి ఆనకట్ట నిర్మాణాన్ని ప్రారంభించలేకపోయామన్నారు. అధికారంలోకి రాగానే మొదటి ప్రాధాన్యతతో ఆనకట్టను నిర్మించి తీరుతామన్నారు. వచ్చే ఐదేళ్లు ప్రజా సంక్షేమ పథకాలు ప్రజలకు కొనసాగాలంటే మళ్లీ వైసిపిని ఆధరిం చాలన్నారు. నారా చంద్రబాబు నాయుడు 2014లో ఇచ్చిన మేనిఫెస్టో హామీలపై తీవ్ర విమర్శలు చేశాడు. చంద్రబాబును నమ్మితే కొండ శిలువ నోట్లో తలపెట్టినట్లేనని తెలిపారు. 2014లో ఆయన ఇచ్చిన హామీలతో పొదుపు సంఘాలు రైతులను నట్టేట ముంచాడని చెప్పారు. రూ.27,615 కోట్ల రైతు రుణమాఫీ చేస్తానని, రూ.1425 కోట్ల పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేస్తామని చెప్పి మోసం చేసింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. రుణమాఫీ, సున్నావడ్డీ, బంగారు రుణాలు, పొదుపు సంఘాలతో పాటు ఆంధ్ర ప్రజలు అందరినీ మోసం చేసి అధికారంలోకి వచ్చి ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా ప్రజల నోట్లు మట్టి కొట్టాడని విమర్శించారు. ఇప్పుడేమో సూపర్‌ సిక్స్‌ హామీలు అంటూ మరో మోసానికి తెర లేపుతున్నాడని, చంద్రబాబు మాటలను ప్రజలు ఎవరు విశ్వసించారన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న నేను ఇచ్చిన మాట తప్పకుండా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి చేయూత, కాపు నేస్తం, ఇబిసి నేస్తం, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, అమ్మబడి వంటి పథకాలు ప్రజలకు వద్దకు చేర్చి మహిళా సాధికారతకు పెద్దపేట వేశానని తెలిపారు. కార్యక్రమంలో కడప ఎంపీ, మైదుకూరు ఎమ్మెల్యే అభ్యర్థులు అవినాష్‌రెడ్డి, శెట్టిపల్లె రఘురామిరెడ్డిని, ఎమ్మెల్సీ రమేష్‌ యాదవ్‌, ఎపిఐఐసి రాష్ట్ర డైరెక్టర్‌ గంగాధర్‌రెడ్డి, జిల్లా వక్ఫ్‌బోర్డ్‌ చైర్మన్‌ మదీనా దస్తగిరి, జడ్‌పిటిసి గోవిందరెడ్డి, చాపాడు ఎంపిపి లక్షుమయ్య, వైసిపి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. కలికిరిలో రాజంపేట ఎంపీ అభ్యర్థి మిథున్‌రెడ్డి, పుంగనూరు, పీలేరు ఎమ్మెల్యే అభ్యర్థులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, చిత్తూరు ఎంపీ అభ్యర్థి రెడ్డప్ప, మాజీ ఎమ్మెల్యే జీవీ శ్రీనాథ్‌రెడ్డి, ముస్లిం మైనార్టీ చైర్మన్‌ డాక్టర్‌ ఇక్బాల్‌ అహ్మద్‌, శ్రీకాంత్‌రెడ్డి, నల్లారి తిమ్మారెడ్డి, సహకార బ్యాంకు చైర్మన్‌ శ్రీకర్రె రెడ్డి, కలికిరి ఎంపిపి వేంపల్లి నూర్జహాన్‌ పాల్గొన్నారు.హామీలపై తీవ్ర విమర్శలు చేశాడు. చంద్రబాబును నమ్మితే కొండ శిలువ నోట్లో తలపెట్టినట్లేనని తెలిపారు. 2014లో ఆయన ఇచ్చిన హామీలతో పొదుపు సంఘాలు రైతులను నట్టేట ముంచాడని చెప్పారు. రూ.27,615 కోట్ల రైతు రుణమాఫీ చేస్తానని, రూ.1425 కోట్ల పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేస్తామని చెప్పి మోసం చేసింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. రుణ మాఫీ, సున్నావడ్డీ, బంగారు రుణాలు, పొదుపు సంఘాలతో పాటు ఆంధ్ర ప్రజలు అందరినీ మోసం చేసి అధికారంలోకి వచ్చి ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా ప్రజల నోట్లు మట్టి కొట్టాడని విమర్శించారు. ఇప్పుడేమో సూపర్‌ సిక్స్‌ హామీలు అంటూ మరో మోసానికి తెర లేపుతున్నాడని, చంద్రబాబు మాటలను ప్రజలు ఎవరు విశ్వసించారన్నారు. ముఖ్య మంత్రిగా ఉన్న నేను ఇచ్చిన మాట తప్పకుండా ఇచ్చిన హామీ లన్నీ నెరవేర్చి చేయూత, కాపు నేస్తం, ఇబిసి నేస్తం, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, అమ్మబడి వంటి పథకాలు ప్రజ లకు వద్దకు చేర్చి మహిళా సాధికారతకు పెద్దపేట వేశానని తెలిపారు. కార్యక్రమంలో కడప ఎంపీ, మైదుకూరు ఎమ్మెల్యే అభ్యర్థులు అవినాష్‌రెడ్డి, శెట్టిపల్లె రఘురామిరెడ్డిని, ఎమ్మెల్సీ రమేష్‌ యాదవ్‌, ఎపిఐఐసి రాష్ట్ర డైరెక్టర్‌ గంగాధర్‌రెడ్డి, జిల్లా వక్ఫ్‌బోర్డ్‌ చైర్మన్‌ మదీనా దస్తగిరి, జడ్‌పిటిసి గోవిందరెడ్డి, చాపాడు ఎంపిపి లక్షుమయ్య, వైసిపి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. కలికిరిలో రాజంపేట ఎంపీ అభ్యర్థి మిథున్‌రెడ్డి, పుంగనూరు, పీలేరు ఎమ్మెల్యే అభ్యర్థులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, చిత్తూరు ఎంపీ అభ్యర్థి రెడ్డప్ప, మాజీ ఎమ్మెల్యే జీవీ శ్రీనాథ్‌రెడ్డి, ముస్లిం మైనార్టీ చైర్మన్‌ డాక్టర్‌ ఇక్బాల్‌ అహ్మద్‌, శ్రీకాంత్‌రెడ్డి, నల్లారి తిమ్మారెడ్డి, సహకార బ్యాంకు చైర్మన్‌ శ్రీకర్రె రెడ్డి, కలికిరి ఎంపిపి వేంపల్లి నూర్జహాన్‌ పాల్గొన్నారు.

➡️