ఉద్యమం తీవ్రతరం చేస్తాం… 30వ రోజు అంగన్వాడీల సమ్మె

Jan 10,2024 17:08 #Tirupati district

ప్రజాశక్తి-సూళ్లూరుపేట(తిరుపతి) అంగన్వాడి కార్యకర్తల సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని అంగన్వాడి జిల్లా నాయకురాలు మేకల హైమావతి అన్నారు.గత 30 రోజులుగా అంగనవాడి కార్మికులు సమ్మె కొనసాగుతుంది.ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఆనుకూలమైన స్పందన రాలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.మాట తప్పను మడమ తిప్పను అని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు పరిష్కారం చేయడంలో రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు.ఈ కార్యక్రమంలో సిఐటియు కార్యదర్శి కే.లక్ష్మయ్య,బి. పద్మనాభయ్య,సుంకర అల్లయ్య,పి మనోహరం, తదితర నాయకులు, అంగన్వాడి కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️