యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామనిటిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ అన్నారు. శనివారం అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలోని విద్యానగర్‌లో ఏర్పాటు చేసిన యువగళం బహిరంగ సభలో నారా లోకేష్‌ యువతతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. నూతనంగా ఓటు హక్కు పొందిన యువతతో ముఖాముఖి కార్యక్రమంలో ద్వారా లోకేష్‌ పలు విషయాలపై చర్చించారు. ఈ సందర్భంగా యువతను ఉద్దేశించి లోకేష్‌ మాట్లాడుతూ యువతో మాట్లాడేందుకే రాజంపేటకు వచ్చానని తెలిపారు. టిడిపి, జనసేన, బిజెపి ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. వైసిపి అడ్డగోలు విధానాల వల్ల రాష్ట్రానికి పరిశ్రమలు రాక, ఉన్న పరిశ్రమలు సైతం ఇతర ప్రాంతాలకు తరలి యువత నిరుద్యోగులుగా మిగిలారని తెలిపారు. గంజాయి, డ్రగ్స్‌కు అలవాటు పడి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకున్నారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ హత్య రాజకీయాలకు దూరంగా ఉంటుందని, యువత కూడా అలాంటి రాజకీయాలను ప్రోత్సహించరాదని వైసిపి పాలకుల వలన రాజంపేట నియోజకవర్గం అన్ని విధాల వెనకబడిందని, ఇసుకాసురుల ధనదాహానికి అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోయి వందల కుటుంబాలు వీధిన పడ్డాయన్నారు. అన్నమయ్య ప్రాజెక్టు వరద బాధితులను తాము అన్ని విధాల ఆదుకుంటామని తెలిపారు. ప్రభుత్వం ఏర్పడిన వంద రోజులలోనే అన్నమయ్య ప్రాజెక్టు పునర్నిర్మాణానం ప్రారంభిస్తామని తెలిపారు. యువగళం పాదయాత్ర ద్వారా ప్రజలతో మమేకమై నేరుగా వారి కష్టనష్టాలు తెలుసుకున్నానని, రానున్న ఉమ్మడి ప్రభుత్వంలో కుల, మత, వర్గ, ప్రాంత బేదాలు చూపకుండా అన్ని వర్గాల వారిని ఆదుకుంటామని, ప్రజలకు సమన్యాయం చేస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో సంక్షేమం కొనసాగిస్తూనే అభివృద్ధికి బాటలు వేస్తామన్నారు. రాజంపేట నియోజకవర్గంలో యువతతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకునేందుకే వచ్చానని, ఎవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదని, రాష్ట్రంలో రానున్నది టిడిపి ప్రభుత్వమేనని, రాజంపేట నియోజకవర్గంలోనూ టిడిపి జెండా రెపరెపలాడిస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాజంపేట నియోజకవర్గ యువతకు తాము అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సుగువాసి బాలసుబ్రమణ్యం, పార్లమెంట్‌ అధ్యక్షులు చమర్తి జగన్‌ మోహన్‌ రాజు, సుగువాసి ప్రసాద్‌ బాబు, టి.లక్ష్మీనారాయణ, నాగోతు రమేష్‌ నాయుడు, వేమన సతీష్‌, గన్నె సుబ్బనసయ్య, సుబ్రహ్మణ్యం నాయుడు, పోలీ శివకుమార్‌ పాల్గొన్నారు.పారంభిస్తామని తెలిపారు. యువగళం పాదయాత్ర ద్వారా ప్రజలతో మమేకమై నేరుగా వారి కష్టనష్టాలు తెలుసుకున్నానని, రానున్న ఉమ్మడి ప్రభుత్వంలో కుల, మత, వర్గ, ప్రాంత బేదాలు చూపకుండా అన్ని వర్గాల వారిని ఆదుకుంటామని, ప్రజలకు సమన్యాయం చేస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో సంక్షేమం కొనసాగిస్తూనే అభివృద్ధికి బాటలు వేస్తామన్నారు. రాజంపేట నియోజకవర్గంలో యువతతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకునేందుకే వచ్చానని, ఎవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదని, రాష్ట్రంలో రానున్నది టిడిపి ప్రభుత్వమేనని, రాజంపేట నియోజకవర్గంలోనూ టిడిపి జెండా రెపరెపలాడిస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాజంపేట నియోజకవర్గ యువతకు తాము అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సుగువాసి బాలసుబ్రమణ్యం, పార్లమెంట్‌ అధ్యక్షులు చమర్తి జగన్‌ మోహన్‌ రాజు, సుగువాసి ప్రసాద్‌ బాబు, టి.లక్ష్మీనారాయణ, నాగోతు రమేష్‌ నాయుడు, వేమన సతీష్‌, గన్నె సుబ్బనసయ్య, సుబ్రహ్మణ్యం నాయుడు, పోలీ శివకుమార్‌ పాల్గొన్నారు.

➡️