ఎంఎల్‌సి షేక్‌ సాబ్జీ మృతి తీరనిలోటు

ప్రజాశక్తి – ఆకివీడు

అంగన్‌వాడీల ఉద్యమానికి బాసటగా నిలిచిన ఉపాధ్యాయ సంఘాల ఎంఎల్‌సి షేక్‌ సాబ్జీ మరణాన్ని నమ్మలేకపోయామని అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి సిఐటియు నాయకులు డి.కళ్యాణి అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు కె.తవిటినాయుడు, షేక్‌ వలీ, అంగన్‌వాడీ నాయకులు పైడేశ్వరి కనకదుర్గ, కృష్ణకుమారి పాల్గొన్నారు.గణపవరం : షేక్‌ సాబ్జీ అకాల మరణం ప్రజా ఉద్యామాలకు తీరనిలోటని సిఐటియు మండల కమిటీ నాయకులు బి.రామకోటి అన్నారు. స్థానిక ఐసిడిఎస్‌ కార్యాలయం వద్ద సమ్మెలో ఏర్పాటు చేసిన సంతాప సభలో ఆయన మాట్లాడారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. తణుకు రూరల్‌ : ఎంఎల్‌సి షేక్‌ సాబ్జీకి అంగన్‌వాడీలు నివాళులర్పించారు. సిఐటియు నాయకులు ప్రతాప్‌, ఎఐటియుసి నాయకులు నాగరాజు, సొసైటీ ఉద్యోగులు నాయకులు సత్యనారాయణ, శ్రీనివాస్‌ మాట్లాడారు. సాబ్జీ ఆశయ సాధనకోసం పనిచేస్తామని తెలిపారు.ఆచంట : ఎంఎల్‌సి షేక్‌ సాబ్జీ మృతి బాధాకరమని యుటిఎఫ్‌ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు కేతా వెంకటేశ్వరరావు అన్నారు. ఆచంట కచేరీ సెంటర్లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో యుటిఎఫ్‌ మండల కార్యదర్శి కె.కాశీ విశ్వనాథం, సిఐటియు మండల కార్యదర్శి వర్ధిపత్తి అంజిబాబు, డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు ఎస్‌విఎన్‌.శర్మ, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు దాసిరెడ్డి కోటేశ్వరరావు, సిపిఎం నాయకులు పి.మోహన్‌రావు, తోటపల్లి సత్యనారాయణ, సిర్రా నరసింహమూర్తి, తలుపూరి బుల్లబ్బాయి, సిర్రా విఘ్నేశ్వరుడు పాల్గొన్నారు.

➡️