ఎన్నికల కోడ్‌ అమలు.. ఫ్లెక్సీలు, బ్యానర్లు తొలగింపు

ప్రజాశక్తి – ఉండి
ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రావడంతో ఉండిలో అధికారులు ఫ్లెక్సీలు, బ్యానర్లు తొలగించే పనిలో నిమఘ్నమయ్యారు. ఉండిలో రెండు రోజుల క్రితం ఎంఎల్‌ఎ మంతెన రామరాజు గోడ స్టిక్కర్లు వేయించడంతో వాటిని అధికారులు సిమెంటుతో తొలగించే పనిలో ఉన్నారు. ఎలక్షన్‌ కోడ్‌ రావడంతో మండలంలో రాజకీయ ప్రతినిధులకు చెందిన ఎటువంటి ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేయరాదని అధికారులు తెలిపారు. ఎవరైనా ఎలక్షన్‌ కమిషనర్‌ ఆదేశాలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
     పాలకొల్లు : ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసిన 24 గంటల్లో బ్యానర్లు, ఫ్లెక్సీలు తీసివేయాలనే ఎన్నికల సంఘం నిబంధనల మేరకు పాలకొల్లు పట్టణంలో శనివారం రాత్రి మున్సిపల్‌ అధికారులు యుద్ధ ప్రాతిపదికన ఫ్లెక్సీలు తొలగించారు.
గణపవరం : సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఎన్నికల కోడ్‌ అమలు కావడంతో ఆదివారం గణపవరంలో పంచాయతీ కార్యదర్శి డిఎస్‌ఆర్‌.ప్రసాద్‌ ఆధ్వర్యంలో గ్రామంలో ఉన్న రాజకీయ నాయకుల ఫ్లెక్సీలు, పార్టీలకు సంబంధించిన వాల్‌పోస్టర్లు, బ్యానర్లు తొలగించారు.

➡️