క్యాంపస్‌ ఇంటర్వ్యూల్లో 10 మంది ఎంపిక

Dec 2,2023 21:59

ప్రజాశక్తి – పాలకొల్లు
పాలకొల్లు ఎఎస్‌ఎన్‌ఎం ప్రభుత్వ కళాశాలలో హెటెరో డ్రగ్స్‌ ఫార్మా కంపనీలో క్యుఎ/క్యుసి ప్రొడక్షన్‌ విభాగాల్లో ఉద్యోగాల ఎంపికలో జిల్లా వ్యాప్తంగా 30 మంది హాజరవ్వగా పది మంది ఎంపికయ్యారని కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ టి.రాజరాజేశ్వరి తెలిపారు. ఈ సందర్భంగా కళాశాలలో జరిగిన ప్రారంభ సభలో ప్రిన్సిపల్‌ మాట్లాడారు. సభకు అతిథిగా శ్రీ సత్యసాయి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హయ్యర్‌ లెర్నింగ్‌ ప్రొఫెసర్‌ బి.ఆండాళ్లు హాజరయ్యారు. హాజరైన విద్యార్థులకు ఆన్‌లైన్‌ పరీక్ష, మౌఖిక పరీక్షలు నిర్వహించారు. ఎంపికైన విద్యార్థులను అభినందించి ఆఫర్‌ లెటర్స్‌ అందించారు. ఈ ప్రాంగణ ఎంపికల్లో కళాశాల జెకెసి కో-ఆర్డినేటర్‌ కె.భద్రాచలం, డాక్టర్‌ వి.యామిని, జెకెసి ట్రైనర్‌ ఎం.కిరణ్‌కుమార్‌, పి.శ్రీనివాసరావు, హెటేరో హెచ్‌ఆర్‌.విజరు పాల్గొన్నారు.

➡️