ఘనంగా జగన్మోహన్‌రెడ్డి పుట్టినరోజు

ప్రజాశక్తి – ఆచంట

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పుట్టినరోజు వేడుకలు రాష్ట్రమంతా ఒక పండుగలా జరుపుకుంటున్నారని వైసిపి రాష్ట్ర కార్యదర్శి వైట్ల కిషోర్‌ కుమార్‌ అన్నారు. గురువారం ఆచంటలో నాయకులు, అభిమానుల మధ్య ముఖ్యమంత్రి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా కేక్‌కట్‌ చేసి అభిమానులకు పంపిణీ చేశారు. అనంతరం పేదలకు, వృద్ధులకు, రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో వైసిపి నేతలు ఉల్లం జ్యోతి రామానుజం, తప్పెట్ల విజయకుమారి వెంకట్రావు పాల్గొన్నారు. అలాగే మండలంలోని ఆచంట, కొడమంచిలి, కందరవల్లి, వల్లూరు, పెనుమంచిలి, ఆచంట వేమవరం, అయోధ్యలంక, శేషమ్మ చెరువు గ్రామ పంచాయతీలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం వృద్ధులకు, పేదలకు రొట్టెలు, పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎఎంసి ఛైర్మన్‌ చిల్లే లావణ్య, గ్రామ సర్పంచులు కోట సరోజినీ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.మొగల్తూరు : స్థానిక గాంధీ బొమ్మ సెంటర్‌లో పార్టీ పట్టణ అధ్యక్షులు కుక్కల కృష్ణమోహన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేక్‌ను సర్పంచి పడవల మేరీ సత్యనారాయణ, జెడ్‌పిటిసి సభ్యులు తిరుమాని బాపూజీ కట్‌చేసి ప్రజలకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచి బోణం నరసింహారావు, దుసనపూడి దొరబాబు పాల్గొన్నారు.కాళ్ల : ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి పుట్టినరోజు వేడుకలను డిసిసిబి ఛైర్మన్‌ పివిఎల్‌.నరసింహరాజు ఆధ్వర్యంలో పెదఅమిరంలోని పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైసిపి సీనియర్‌ నాయకులు గోకరాజు రామరాజు నేతలతో కలిసి కేక్‌ కట్‌ చేశారు. పివిఎల్‌ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరంలో సుమారు 200 మందికి పైగా రక్తదానం చేశారు. అనంతరం 120 మందిపైగా వృద్ధులకు దుప్పట్లు, పండ్లు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గోకరాజు రామరాజు మాట్లాడారు. కార్యక్రమంలో క్షత్రియ కార్పొరేషన్‌ ఛైౖర్మన్‌ పాతపాటి శ్రీనివాసు రాజు (వాసు), పెద అమిరం గ్రామ సర్పంచి డొక్కు సోమేశ్వరరావు, కోపల్లె సొసైటీ ఛైౖర్మన్‌ వేగేశ్న జయ రామకృష్ణంరాజు, వైసిపి మండల కన్వీనర్‌ గణేశ్న రాంబాబు పాల్గొన్నారు.

➡️