ఛాంబర్స్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌కు విశేష స్పందన

ప్రజాశక్తి – పాలకొల్లు
స్థానిక ఛాంబర్స్‌ జూనియర్‌ కళాశాలలో ఆదివారం పదో తరగతి విద్యార్థులకు మెరిట్‌ స్కాలర్‌షిప్‌టెస్ట్‌-2024 నిర్వహించారు. ఈ టెస్టుకు జిల్లాలోని పలు ప్రభుత్వ, ప్రయివేట్‌ పాఠశాలల నుంచి 1935 మంది విద్యార్థులు హాజరై విశేష స్పందన కనబరిచారు. ముఖ్య అతిథిగా మాజీ ఎంఎల్‌ఎ డాక్టర్‌ బాబ్జి హాజరయ్యారు. టెస్ట్‌ ప్రశ్నపత్రాన్ని ఆవిష్కరించారు. విద్యార్థుల్లో నిమ్మిడీకృతమైన పాఠ్యాంశాల ప్రతిభా పాటవాలను వెలికి తీయటానికి ఇటువంటి పోటీ పరీక్షలు బాగా ఉపయోగపడతాయని చెప్పారు. లాభాపేక్ష లేని అత్యున్నత విద్యను అందిస్తూ పాలకొల్లు చుట్టుపక్కల ప్రాంత మధ్యతరగతి, ఆర్థికంగా వెనుకబడి ఉన్న విద్యార్థులకు మంచి విద్యను అందిస్తోందని చెప్పారు. ఈ 2024కు 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఛాంబర్స్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీని అభినందించారు. ఛైర్మన్‌ కెవిఆర్‌.నరసింహరావు మాట్లాడుతూ రూ.రెండు కోట్లతో నిర్మించిన అత్యాధునిక వసతుల ఇంటర్‌ కొత్త భవనాన్ని త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. సెక్రటరీ కలిదిండి రామరాజు, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌ డి.వెంకటేశ్వరరావు, జూనియర్‌ కళాశాల ప్రిన్సిపల్‌ ఓల్గా, కోశాధికారి జల్లూరి రామలింగేశ్వరరావు, గవర్నింగ్‌ బాడీ మెంబర్స్‌ ఇనుకొండ రంగారావు, అడబాల రమణ, దేవరపు లక్ష్మీనారాయణ, ఎస్‌.కామేశ్వరరావు, కనుమూరి సీతారామరాజు, రేపాక ప్రవీణ్‌ భాను పాల్గొన్నారు.

➡️