తాగునీటి కోసం వెతలు

ధ్వంసమైన పైపులైన్‌
కొత్తకాయలతిప్పలో మహిళల అవస్థలు
సమస్యను పరష్కరించాలని వేడుకోలు
ప్రజాశక్తి – మొగల్తూరు
వేసవి ఆరం భంలోనే ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మొగల్తూరు పంచాయతీ పరిధి కొత్తకాయలతిప్ప గ్రామానికి కెపి.పాలెం సమగ్ర రక్షిత తాగునీటి పథకం నుంచి పైపులైన్‌ ద్వారా శుద్ధి జలలు సరఫరా అవుతున్నాయి. శుద్ధి లాలు సరఫరా చేసే పైపులైన్‌ ధ్వంసం కావడంతో ఐదు రోజులుగా కొత్తకాయలతిప్ప గ్రామానికి శుద్ధి జలాల సరఫరా నిలిచిపోయింది. దీంతో గ్రామంలోని సుమారు రెండు వేల మంది ప్రజలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాగు, ఇతర నీటి అవసరాల కోసం ప్రజలు కుళాయిపైనే ఆధారపడుతున్నారు. పైపులైన్‌ ధ్వంసం కావడంతో శుద్ధి జలాలను ఇతర ప్రాంతాల్లో కొనుగోలు చేసి టిన్నుల్లో తెచ్చుకుంటున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాగునీటి సమస్యను పరిష్కరించాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు. ఈ సమస్యను ప్రజాశక్తి ఆర్‌డబ్యూఎస్‌ డిఇ శ్రీనివాస్‌ దృష్టికి తీసుకెళ్లగా సమస్యను వెంటనే పరిష్కరించి శుద్ధి జలాలు అందిస్తామని చెప్పారు.

➡️