తాళాలు బద్దలు కొట్టినా సమ్మె కొనసాగిస్తాం

ప్రజాశక్తి – భీమవరం రూరల్‌

తాళాలు బద్దలు కొట్టినా, నిర్బంధాన్ని విధించినా సమ్మె ఆపేది లేదని అంగన్‌వాడీలు తెలిపారు. సోమవారం భీమవరం సిఐటియు ఆఫీసు నుంచి ప్రదర్శనగా అంబేద్కర్‌ విగ్రహం, కెఎల్‌ఎం రోడ్డు మీదుగా తాలూకా ఆఫీస్‌ నుంచి ఆర్‌డిఒ కార్యాలయానికి చేరుకుని అక్కడ బైఠాయించారు. సమ్మెకు యుటిఎఫ్‌ ప్రతినిధి బృందం మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా యుటిఎఫ్‌ రాష్ట్ర కోశాధికారి బి.గోపీమూర్తి ప్రసంగించారు. అంగన్‌వాడీల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేస్తుంటే పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం తన దుర్మార్గాన్ని బయటపెట్టిందన్నారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి.వాసుదేవరావు, అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా నాయకులు ఎమ్‌డి హసీనా, డి.కళ్యాణి మాట్లాడారు. అనంతరం ఆర్‌డిఒకు, అడిషనల్‌ ఎస్‌పికి వినతిపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు ఎం.ఆంజనేయులు, సూరిబాబు, ఇంజేటి శ్రీనివాసు, అంగన్‌వాడీ నాయకులు విజయలక్ష్మి, నాగరత్నం, దుర్గ, మార్తమ్మ పాల్గొన్నారు.నరసాపురం టౌన్‌ : అంగన్‌వాడీల సమ్మె ఏడో రోజు కొనసాగింది. ఈ మేరకు స్థానిక బస్టాండ్‌ సెంటర్‌ నుంచి నరసాపురం డివిజన్‌కు చెందిన అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ భారీ సంఖ్యలో ర్యాలీ చేస్తూ మెయిన్‌ రోడ్డు, గాంధీ సెంటర్‌, పాత బజార్‌, పంజాసెంటర్‌, మున్సిపల్‌ ఆఫీస్‌ రోడ్‌ మీదుగా ఆర్‌డిఒ కార్యాలయానికి చేరుకున్నారు. వీరితో పాటు సిఐటియు జిల్లా అధ్యక్షుడు గోపాలన్‌, జనసేన నాయకులు బొమ్మిడి నాయకర్‌, రెడ్డి అప్పలనాయుడు కూడా ప్లకార్డులు పట్టుకుని అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలని నిరసన తెలిపారు. అనంతరం ఆర్‌డిఒ అచ్యత అంబరీష్‌కు వినతి పత్రం అందజేశారు. ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా నాయకురాలు కానురి తులసి, ఎ.రాణి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో గోపాలన్‌, బొమ్మిడి నాయకర్‌, రెడ్డి అప్పలనాయుడు మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కవురు పెద్దిరాజు, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు కేతా పద్మ, సిఐటియు జిల్లా కార్యదర్శి ముచ్చర్ల త్రిమూర్తులు, జిల్లా ఉపాధ్యక్షుడు తెలగంశెట్టి సత్యనారాయణ, పట్టణ కార్యదర్శి పొన్నాడ రాము మాట్లాడారు. కార్యక్రమంలో రజనీ, నిర్మల కుమారి, రాజేశ్వరి, జి.వెంకటలక్ష్మి, ఎ.నీలిమ పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం:అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం ఏడో రోజు సమ్మె కొనసాగింది. తాడేపల్లిగూడెం, గణపవరం, తణుకు సెక్టార్ల ఆధ్వర్యంలో స్థానిక ఆర్‌టిసి బస్టాండ్‌ నుంచి ఆర్‌డిఒ కార్యాలయం వరకూ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి సిఐటియు పట్టణ కమిటీ సంఘీభావం తెలిపింది. అనంతరం ఆర్‌డిఒకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.రాజా రామ్మోహన్‌రారు, కార్యదర్శి కర్రి నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులు సిరపరపు రంగారావు, అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు కె.ఝాన్సీలక్ష్మీ, ఎ.అజయకుమారి, ప్రాజెక్టు అధ్యక్షురాలు దీన స్వరూపరాణి, జి.గాయత్రి ప్రసన్న, ప్రభారాణి మాట్లాడారు. అంగన్‌వాడీలకు రూ.26 వేల జీతం ఇవ్వాలని, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం గ్రాడ్యూటీ అమలు చేయాలని, ఐసిడిఎస్‌ సెంటర్లను బలోపేతం చేయాలని, రిటైర్మెంట్‌ తర్వాత రూ.5 లక్షలు ఇవ్వాలని, యాప్‌ సిస్టంను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టణ కార్యదర్శి కరెడ్ల రామకృష్ణ, పతివాడ నాగేంద్రబాబు, యడవల్లి వెంకట దుర్గారావు, తాడేపల్లిగూడెం, గణపవరం, తణుకు మండలాల అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ సభ్యులు పాల్గొన్నారు.ఆచంట (పెనుమంట్ర) : అంగన్‌వాడీల సమ్మెలో భాగంగా సోమవారం పాలకొల్లు ఆర్‌డిఒ కార్యాలయానికి ర్యాలీగా తరలివెళ్లారు. ఈ కార్యక్రమంలో కోడే శ్రీనివాస ప్రసాద్‌ పాల్గొని మాట్లాడారు. పెనుమంట్ర, ఆలమూరు సెక్టార్‌ నుండి తాడేపల్లిగూడేనికి కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కూసంపూడి సుబ్బరాజు ఆధ్యర్యంలో అంగన్‌వాడీలు తరలివెళ్లారు.మొగల్తూరు : అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆర్‌డిఒ కార్యాలయాన్ని ముట్టడించారు. మొగల్తూరు నుండి అంగన్‌వాడీలు అధిక సంఖ్యలో భారీ ప్రదర్శనగా నరసాపురం బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీలు పెద్దింట్లు, సారమ్మ, సీత రాజి రేఖా శాంభవి పాల్గొన్నారు.

➡️