‘దళితవాడల్లో నోచని రోడ్ల నిర్మాణం

‘ప్రజాశక్తి – పాలకొల్లు రూరల్‌

వైసిపి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాలుగున్నర సంవత్సరాల్లో దళిత గ్రామాల్లో సిమెంట్‌ రోడ్ల నిర్మాణాలకు నోచుకోలేదని టిడిపి, జనసేన ఎస్‌సి సెల్‌ నాయకులు తెలిపారు. పూలపల్లిలో ఈదవారిపేట, చినపేట, పెద్దపేట, పంది గుంట ఏరియాల్లో 27 దళిత స్కీములు అమలు చేయాలని ఆయా నేతలు ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు పాముల రజినీకుమార్‌, తాళ్ల నాగరాజు, సబ్బే పుష్పరాజు, బుడుతి బుల్లిరాజు, మైలా దుర్గాప్రసాద్‌ పాల్గొన్నారు.

➡️