పూల ధరలకు రెక్కలు

ప్రజాశక్తి – పాలకొల్లు

మార్కెట్లో పూల ధరలకు రెక్కలొచ్చాయి. ఎండలు పెరగడం, ఈస్టర్‌ పండుగ, వివాహ వేడుకల సందర్భంగా ఆదివారం మార్కెట్లో పూల ధరలు భగ్గుమన్నాయి. కిలో చామంతులు రూ.400, బంతిపూలు కిలో రూ.200, గులాబీలు కిలో రూ.500, మల్లెపూలు మూర రూ.80 నుంచి రూ.వంద, కనకాంబరాలు మూర రూ.వంద నుంచి రూ.150 వరకూ విక్రయిస్తున్నారు. దీంతో సామాన్య, మధ్యతరగతి మహిళలకు అందుబాటులోకి పూలు రానంటున్నాయి. వేసవి తీవ్రతతో పూల దిగుబడి తగ్గి ధరలు పెరగడానికి కారణమని పూల వ్యాపారి షేక్‌ మహబూబ్‌ జానీ చెప్పారు.

➡️