ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలి

16న గ్రామీణ బంద్‌, సమ్మె జయప్రదానికి పిలుపు
ప్రజాశక్తి – ఏలూరు అర్బన్‌
డ్రైవర్లకు ఉరితాడు వంటి ప్రమాదకర బిఎన్‌ఎస్‌ 106 హిట్‌ అండ్‌ రన్‌ చట్టాన్ని బేషరతుగా రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ 16న దేశవ్యాప్త సమ్మెలో రవాణా రంగ కార్మికులందరూ పాల్గొనాలని ఆల్‌ ఇండియా రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ జిల్లా కమిటీ ప్రధాన కార్యదర్శి జె.గోపీ విజ్ఞప్తి చేశారు. స్థానిక సిఐటియు జిల్లా కార్యాలయంలో బుధవారం నిర్వహించిన ఫెడరేషన్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. బ్రిటిష్‌ చట్టాలు రద్దుచేసి భారతీయ చట్టాలను తీసుకొస్తామని చెప్పి, డ్రైవర్లను తమ వృత్తి నుంచి గెంటివేసే పద్ధతిలో మోడీ ప్రభుత్వం చట్టాలను తీసుకువచ్చిందని విమర్శించారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి.సోమయ్య మాట్లాడుతూ రవాణా రంగ కార్మికులకు వారి కుటుంబాలను రక్షించే విధం గా, సమగ్ర సంక్షేమ చట్టాన్ని తీసుకురావాలని, రవాణా రంగ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. .భీమడోలు : ఉంగుటూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల్లో 16వ తేదీన నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్‌.లింగరాజు తెలిపారు. సన్నాహాక చర్యలను పరిశీలించేందుకు భీమడోలు మండలంలో బుధవారం సాయంత్రం ఆయన పర్యటించి పలువురిని కలిశారు. పూళ్ల రైస్‌ మిల్లు వద్ద కార్మికులతో కలిసి సమ్మె కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల నాయకులు బెండి శ్రీనివాసరావు, కౌలు రైతు సంఘం జిల్లా కన్వీనర్‌ కొర్ని అప్పారావు పాల్గొన్నారు.కొయ్యలగూడెం : మండల కేంద్రం కొయ్యలగూడెం హై స్కూల్‌ ఆవరణలో సిఐటియు మండల సమావేశాలు బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ నెల 16వ తేదీన జరగబోయే గ్రామీణ భారత్‌ బంద్‌, పారిశ్రామిక సమ్మె గురించి విస్తృతస్థాయిలో చర్చించారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు శుక్లబోయిన రాంబాబు, జిల్లా సెక్రటరీ నాగమణి, జి.నాగమాధవి, టి.చిట్టి, ఎస్‌.సత్యవతి, వి.ధనలక్ష్మి, షేక్‌ మౌలాలి, శివకుమార్‌ పాల్గొన్నారు.జీలుగుమిల్లి : కేంద్ర ప్రభుత్వ కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా కిసాన్‌ మోర్చా పిలుపులో భాగంగా ఈ నెల 16వ తేదీన నిర్వహించే గ్రామీణ బంద్‌ను జయప్రదం చేయాలని సిపిఎం మండల కార్యదర్శి తెల్లం దుర్గారావు, న్యూ డెమోక్రసీ నాయకులు వెట్టి సుబ్బన్న పిలుపునిచ్చారు. మండలంలోని వర్తక, వాణిజ్య, వ్యాపార సంస్థలకు ముందస్తుగా బుధవారం ప్రచారం నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి తెల్లం దుర్గారావు, న్యూ డెమోక్రసీ మండల కార్యదర్శి వెట్టి సుబ్బన్న మాట్లాడారు. ఈ కార్యక్ర మంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు ఎన్‌వి.అప్పారావు, చిట్టిబొమ్మ కొండలరావు, సిరిబత్తుల సీతారామయ్య, న్యూ డెమోక్రసీ నాయకులు కట్నం నాగేశ్వరావు పాల్గొన్నారు. చింతలపూడి :ఈ నెల 16వ తేదీన దేశ వ్యాప్త గ్రామీణ బంద్‌, కార్మికుల సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్‌వి.సత్యనారాయణ, కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య పిలుపునిచ్చారు. పట్టణంలో సిపిఐ కార్యాలయం వద్ద రైతు కార్మిక సంఘాల సమావేశం ఎఐకె కెఎస్‌.రాష్ట్ర అధ్యక్షులు డి.రంగనాథ్‌, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్‌వి.సత్యనారాయణ, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి దొంత కృష్ణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ సమావేశంలో సిఐటియు మండల కార్యదర్శి ఎం.బాలరాజు, ఎఐటియుసి జిల్లా కో-కన్వీనర్‌ తోర్లపాటి బాబు, ఆశావర్కర్స్‌ యూనియన్‌ నాయకురాలు హెచ్‌.సుందరి, అంగన్వాడీ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు జి.అంజమ్మ, సరోజినీ మాణిక్యం పాల్గొన్నారు.కలిదిండి : ప్రజా సంఘాల అధ్వర్యంలో మండలంలోని పెదలంక, మూలలంక, భాస్కరరావు పేట, గుర్వాయిపాలెం, చినతాడినాడ, పోతుమర్రు, కోరుకొల్లు, సానా రుద్రవరం, కలిదిండి గ్రామాల్లో కరపత్రాలను పంపిణీ చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరిస్తూ ప్రచారం నిర్వహించారు. ప్రజా సంఘాల నాయకులు శేషపు మహంకాళిరావు, షేక్‌ అబిదా బేగం, పి.ప్రకాష్‌, వి.భాస్కరరావు, ఎ.వెంకటేశ్వరరావు, చిన్నం శ్రీకాంత్‌, ఎ.వెంకటేశ్వరరావు, కె.శ్రీనివాసరావు, జ్యానేషు, జి.సోమయ్య పాల్గొన్నారు.ఉంగుటూరు : రైతులు, కార్మికుల సమస్యల పరిష్కారానికి ఈ నెల 16న జరిగే నిరసన కార్యక్రమాలకు సంబంధించి కరపత్రాలను సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్‌.లింగరాజు కైకరంలో బుధవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు. నిడమర్రు : నిడమర్రు, అడవికొలను, భువనపల్లి గ్రామాల్లో కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు నారపల్లి రమణరావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు కంచ వరప్రసాద్‌, కమిలి నాని, రైతు సంఘం నాయకులు కానూరు రాజు, వెలగలేటి మోహన నాగేశ్వరరావు పాల్గొన్నారు.

➡️