ప్రభుత్వం దిగొచ్చే వరకూ సమ్మె

ప్రజాశక్తి – కాళ్ల

రాష్ట్ర సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేతిలో ముఖ్యమంత్రి జగన్‌ గంగిరెద్దులా మారారని అంగన్వాడీ టీచర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ నాయకురాలు దావులూరి మార్తమ్మ విమర్శించారు. తహశీల్దార్‌ కార్యాలయం వద్ద అంగన్‌వాడీలు సమ్మె కొనసాగింది. ఈ సందర్భంగా ఎస్మా జిఒ 2ను రద్దు చేయాలని కోరుతూ గంగిరెద్దుకు వినతిపత్రం అంద జేశారు. కార్యక్రమంలో మేరీమాత, లక్ష్మి, కాసీరత్నం, వెంకటలక్ష్మి, రమాదేవి, పద్మ రాజకుమారి పాల్గొన్నారు.పెంటపాడు : అంగన్వాడీల సమ్మె 29వ రోజుకు చేరింది. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని కోరుతూ అంగన్వాడీల తల్లులు పిల్లలతో వచ్చి సమ్మెలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు సిరపరపు రంగారావు, సిపిఎం మండల కార్యదర్శి చిర్ల పుల్లారెడ్డి, అంగన్‌వాడీ నాయకులు జై.శ్యామలాకుమారి, వి.కనకమహాలక్ష్మి, జె.జయలక్ష్మి మాట్లాడారు. కార్యక్రమంలో ఆర్‌.అనురాధ, జి.జయలక్ష్మి, సిహెచ్‌.శ్రీదేవి, హైమ, వెంకటలక్ష్మి, నాగమణి, శిరీష, మంగతాయారు పాల్గొన్నారు.పోడూరు : పట్టు పట్టక్కా జెండా.. పట్టక్కా సిఐటియు నీకు నాకు అండా దండ అక్కా.. అంగన్వాడీ హక్కులు సాధిస్తాం అక్కా కల్లల్లోన వెలుగులు నింపే ధ్యేయం మనదక్కా అంటూ 29వ రోజు మంగళవారం అంగన్వాడీలు ఎస్మా చట్టాన్ని లెక్కజేయకుండా ఆట పాటలతో తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. కార్యక్రమంలో ప్రాజెక్ట్‌ లీడర్‌ పీతల రాజమణి, జె.ఉమాదేవి, రాయుడు కుమారి, సిఐటియు నాయకులు పిల్లి.ప్రసాద్‌, బురాబత్తుల వెంకటరావు పాల్గొన్నారు.వీరవాసరం :అంగన్‌వాడీల సమ్మె 29వ రోజుకు చేరింది. అంగన్‌వాడీలు సమ్మె శిబిరం వద్ద 29 సంఖ్యగా ఏర్పడి నిరసన తెలిపారు. ఎస్మాకు భయపడేది లేదని యూనియన్‌ నాయకురాలు నాగరత్నం తెలిపారు.ఆచంట (పెనుమంట్ర) : అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగించడం దుర్మార్గపు చర్య అని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కేతా గోపాలన్‌ అన్నారు. సిఐటియు ఆధ్వర్యంలో తహశీల్దార్‌ కార్యాలయం వద్ద చేపట్టిన సమ్మె కొనసాగింది. ఈ సందర్భంగా అంగన్వాడీలు మెడకు ఉరితాళ్లు వేసుకుని నిరసన తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి కోడి శ్రీనివాస్‌ప్రసాద్‌, అంగన్వాడీ సెక్టార్‌ నాయకులు సరస్వతి, సాయి మహాలక్ష్మి, మౌనిక పాల్గొన్నారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు సూర్యుడు వెంకటేశ్వరరావు, కౌలు రైతు కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కె.సుబ్బరాజు సంఘీభావం తెలిపారు.ఆచంట : అంగన్‌వాలను భీమవరంలో అక్రమ అరెస్టు చేయడం సిగ్గుచేటని సిఐటియు మండల కార్యదర్శి వద్దిపర్తి అంజిబాబు అన్నారు. ఆచంట కచేరీ సెంటర్లో సమ్మె కొనసాగింది. కార్యక్రమంలో మైలే విజయలక్ష్మి, జి.కమల, వెంకటలక్ష్మి, సత్యవతి, మల్లేశ్వరి, పద్మ, సుజాత, ఝాన్సీ పాల్గొన్నారు.మొగల్తూరు : మొగల్తూరులో అంగన్వాడీలు 29వ రోజు చెవిలో పువ్వు పెట్టుకుని నిరసన తెలిపారు. కార్యక్రమంలో పెద్దింట్లు, సారమ్మ, సీత, నాగలక్ష్మి, రేఖ, సాంభవి పాల్గొన్నారు.తాడేపల్లిగూడెం : అంగన్వాడీల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి వలవల బాబ్జి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అంగన్‌వాడీ యూనియన్‌ ప్రాజెక్టు అధ్యక్షురాలు స్వరూపారాణి, సిఐటియు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో తహశీల్దార్‌ కార్యాలయం వద్ద చేపట్టిన సమ్మెలో భాగంగా చేతులకు సంకెళ్లు వేసుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బాబ్జి మాట్లాడారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు యడవల్లి వెంకట దుర్గారావు పాల్గొన్నారు.యలమంచిలి : అంగన్వాడీల సమ్మె కొనసాగింది. ఈ సందర్భంగా అంగన్వాడీలు ఖాళీ కంచాలు మోగించి నిరసన తెలిపారు. సమ్మెకు సిపిఎం నాయకులు సంఘీభావం తెలిపారు. సిఐటియు మండల కార్యదర్శి దేవ సుధాకర్‌, అంగన్వాడీ నేతలు బి.రజినీదేవి పాల్గొన్నారు.ఆకివీడు : 29 రోజులుగా అంగన్‌వాడీలు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని అంగన్వాడీల యూనియన్‌ నాయకురాలు కృష్ణవేణి అన్నారు. ఈ మేరకు అంగన్‌వాడీలు కుర్చీలు తలకిందులుగా చేసి చూపిస్తూ నిరసన తెలిపారు. కార్యక్రమంలో అంగన్వాడీలు నోము, భాను, దుర్గ, కుమారి, కృష్ణవేణి, భవాని, అమ్మాజీ, వెంకటలక్ష్మి పాల్గొన్నారు.ఉండి : రాష్ట్ర ప్రభుత్వ బెదిరింపులకు అదరం, బెదరం అని అంగన్వాడీ మండల అధ్యక్ష కార్యదర్శులు ఎం.చైతన్య, డి.సత్యవేణి అన్నారు. తహశీల్దార్‌ కార్యాలయం వద్ద అంగన్వాడీల సమ్మె 29వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కార్యక్రమంలో అంగన్‌వాడీలు ఝాన్సీ, గడి కుసుమ, శ్యామల, లలిత, శ్రీదేవి, ప్రేమలత, విజయకుమారి పాల్గొన్నారు.నరసాపురం టౌన్‌ : అంగన్‌్‌వాడీల సమ్మె 29వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా అంబేద్కర్‌ కూడలిలో రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐద్వా జిల్లా కార్యదర్శి పొగాకు పూర్ణ సంఘీభావం తెలిపి ప్రసంగించారు. అంగన్‌వాడీ నాయ కురాలు ఆకుల నీలిమ మాట్లాడారు. అనంతరం గంగిరెద్దుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో కృష్ణవేణి, రాజేశ్వరి, రత్నకుమారి, శ్రీలక్ష్మి పాల్గొన్నారు.పెనుగొండ : మండలంలో అంగన్‌వాడీల సమ్మె కొనసాగింది. డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని సిఐటియు నాయకురాలు తులసి అన్నారు. కార్యక్రమంలో అంగన్వాడీలు పాల్గొన్నారు.

➡️