మళ్లీ కుంగిన ఏటిగట్టు

ప్రజాశక్తి – నరసాపురం

పట్టణంలో రూ.26.32 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న పొన్నపల్లి ఏటిగట్టు అభివృద్ధి పనులు పలుసార్లు గోదావరిలోకి కుంగిపోవడంతో స్థానికులు భయబ్రాంతులకు గురవుతున్నారు. తాజాగా బుధవారం సాయంత్రం మరోసారి గట్టు గోదావరిలోకి కుంగిపోయింది. ఈ సంవత్సరంలో గట్టు కుంగిపోవడం ఇది మూడోసారి. ఈ నేపథ్యంలో ఆర్‌డిఒ అచ్యుత అంబరీష్‌ కుంగిన పొన్నపల్లి ఏటిగట్టును పరిశీలించారు. గట్టుపైకి ఎవరూ రాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వాహనాలు రాకపోకలు జరగకుండా చూడాలని సూచించారు. కన్జర్వేన్సీ ఉన్నతాధికారులు ఈ ప్రాంతాన్ని ఇటీవల పరిశీలించి ఎవరూ భయాందోళనకు గురి కావద్దన్నారు.

➡️