రికార్డుల నిర్వహణ సక్రమంగా లేకుంటే చర్యలు

Dec 4,2023 21:35

ఉండి పోలీస్‌స్టేషన్‌ను సందర్శించిన డిఎస్‌పి శ్రీనాథ్‌
ప్రజాశక్తి – ఉండి
రికార్డుల నిర్వహణ సక్రమంగా లేకపోతే చర్యలు తీసుకుంటామని భీమవరం డిఎస్‌పి బి.శ్రీనాథ్‌ హెచ్చరించారు. సోమవారం ఉండి పోలీస్‌స్టేషన్‌ను సందర్శించిన ఆయన పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సాధారణ తనిఖీల్లో భాగంగానే ఉండి పోలీసుస్టేషన్‌ను సందర్శించి రికార్డుల నిర్వహణను పరిశీలించినట్లు చెప్పారు. ఇటీవల మండలంలో దిశ కేసులు నమోదు కావడంతో వాటిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. సుమారు నెల రోజుల నుంచి ఖాళీగా ఉన్న ఉండి పోలీసుస్టేషన్‌ ఎస్‌ఐ స్థానాన్ని మరో పది రోజుల్లో భర్తీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఆయనతో పాటు ట్రైనీ డిఎస్‌పి కఠారి అరవింద్‌ ఉన్నారు.

➡️