రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ మంజూరు

32,545 మంది రైతులకు రూ.26.72 కోట్లు
జాయింట్‌ కలెక్టర్‌ రామ్‌సుందర్‌రెడ్డి
ప్రజాశక్తి – భీమవరం
జిల్లాలో గతేడాది ఖరీఫ్‌లో తుపాన్‌ వల్ల పంట దెబ్బతిన్న 32,545 మంది వ్యవసాయ, ఉద్యాన రైతులకు రూ.26.72 కోట్లు ఇన్‌పుట్‌ సబ్సిడీ మంజూరైనట్లు జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.రామ్‌సుందర్‌రెడ్డి తెలిపారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి బుధవారం ఇన్‌పుట్‌ సబ్సిడీని సిఎం జగన్‌ బటన్‌ నొక్కి నేరుగా జమ చేయగా భీమవరం కలెక్టరేట్‌ నుంచి జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.రామ్‌సుందర్‌రెడ్డి, జిల్లా వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్‌ కైగాల శ్రీనివాసరావు, జిల్లా వ్యవసాయ శాఖాధికారి జెడ్‌.వెంకటేశ్వరరావు, జిల్లా ఉద్యాన శాఖాధికారి సిహెచ్‌.శ్రీనివాసులు, రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెసి రామ్‌సుందర్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో మిచౌంగ్‌ తుపాను వల్ల పంట నష్టపోయిన 31,678 మంది వరి రైతులకు రూ.26.22 కోట్లు, ఉద్యాన పంటలు నష్టపోయిన 867 మంది రైతులకు రూ.50.60 లక్షలు ఇన్‌ఫుట్‌ సబ్సిడీ మంజూరైందన్నారు. అనంతరం రైతులకు నమూనా చెక్‌ను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యులు కొట్టి కుటుంబరావు, తాడేపల్లిగూడెం ఎఎంసి ఛైర్మన్‌ ముప్పిడి సంపత్‌కుమార్‌, లీడ్‌బ్యాంకు మేనేజరు ఎ.నాగేంద్రప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️