రైలు ఢకొీని 80 గొర్రెలు మృతి 

భీమవరం రూరల్‌ :భీమవరం శివారు ఉండి రోడ్డు సమీపంలో పట్టాల దాటుతున్న గొర్రెల మందను ఓ రైలు ఢకొీంది. దీంతో 80 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. ఈ ఘటన బుధవారం చోటు చేసుకుంది. పట్టాలపై చెల్లాచెదురుగా మృతి చెంది తునా తునకలైన పడిఉన్న గొర్రెలను చూసి గొర్రెల మంద కాపరి ఆవేదన వ్యక్తం చేశాడు. ఇదే అదునుగా కొందరు మాంసం వ్యాపారులు మృతి చెందిన గొర్రెలను అయినకాడికి కొనుగోలు చేసి తీసుకెళ్లారు. సుమారు రూ.15,000 విలువచేసే ఒక్కో గొర్రెను వ్యాపారులు రూ.రెండు నుంచి రూ.మూడు వేలు చెల్లించి తీసుకెళ్లారు. పొట్టకూటి కోసం గొర్రెలు మేపుకుంటూ జీవిస్తున్న వారికి ఈ ప్రమాదం తీవ్ర ఆర్థిక నష్టాన్ని కలిగించింది. బాధిత గొర్రెల మంద కాపరులు వివరాలు చెప్పడానికి నిరాకరించారు. సంఘటన స్థలం నుంచి మిగతా గొర్రెలను తోలుకొని వెళ్లిపోయారు. ఈ సంఘటనపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని రైల్వే పోలీసులు తెలిపారు.

➡️