లయన్స్‌ క్లబ్‌ సేవలు స్ఫూర్తిదాయకం

Jan 11,2024 21:03

ప్రజాశక్తి – తాడేపల్లిగూడెం
తాడేపల్లిగూడెం డైమండ్స్‌ లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న సేవలు స్ఫూర్తిదాయకమని 316 జిల్లా గవర్నర్‌ గట్టిం మాణిక్యాలరావు అన్నారు. డైమండ్స్‌ అధ్యక్షులు కొప్పిశెట్టి రమణయ్య పుట్టినరోజును పురస్కరించుకుని గురువారం నిర్వహించిన పలు సేవా కార్యక్రమాల్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గట్టిం మాణిక్యాలరావు మాట్లాడుతూ డైమండ్స్‌ లయన్స్‌ క్లబ్‌ ద్వారా మరింత మందికి సేవలు అందాలన్నారు. క్లబ్‌ అధ్యక్షులు కొప్పిశెట్టి రమణయ్య ఆధ్వర్యంలో 180 రోజుల్లో 250 సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. జోన్‌ చైర్‌పర్సన్‌ లయన్‌ పేరిచర్ల మురళీకృష్ణంరాజు మాట్లాడుతూ గుప్త దాతగా అనేక దైవిక కార్యక్రమాలకు సహకారం అందించిన మోడ్రన్‌ చంటి స్ఫూర్తితో లయన్స్‌ సభ్యులు మరిన్ని సేవలందించాన్నారు. పడాల జీవన సంధ్య వృద్ధాశ్రమంలో వృద్దులకు అన్నదానం, యాగర్లపల్లి ప్రేమలయం ఆశ్రమంలో పండ్లు, పౌష్టకాహారం, లార్డ్స్‌ ఆఫ్‌ లైఫ్‌ చిల్డ్రన్స్‌ హోమ్‌కు రైస్‌ బ్యాగ్‌, యాచకులకు ఫుడ్‌ ప్యాకెట్స్‌ అందించారు. ఈ కార్యక్రమలో లయన్స్‌ పుత్రయ్య, కుందుం వెంకటేశ్వరరావు, యర్రా ఆంజనేయస్వామి, కలవచర్ల సత్యనారా యణ, కొప్పెళ్ల సాయి, సత్యనారాయణరాజు, జామి సత్యనారాయణ, అభయం లియో, లయన్‌ అధ్యక్షులు మాధురి పాల్గొన్నారు.

➡️