విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీ

ప్రజాశక్తి – మొగల్తూరు

సాంకేతికతను పెంచేందుకు విద్యార్థులకు ప్రభుత్వం ట్యాబ్‌లు పంపిణీ చేస్తోందని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌విప్‌ ముదునూరి ప్రసాదరాజు అన్నారు. నరసాపురం నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలలో చదివే 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వ చీఫ్‌విప్‌ ముదునూరి ప్రసాదరాజు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మొగల్తూరు జిల్లా పరిషత్‌ హైస్కూల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ సర్కారు బడుల్లో విద్యను సాంకేతికీకరణ బాట పట్టించడానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతిస్తోందన్నారు. సర్కారు పాఠశాలల్లో విద్యార్థులు కిందిస్థాయి నుంచే సాంకేతికతపై పట్టు సాధించేలా ముందు చూపుతో ట్యాబ్‌లు అందిస్తూ విద్యార్థుల దీర్ఘకాలిక ప్రయోజనాలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. నరసాపురం నియోజకవర్గంలో 1986 మంది విద్యార్థులకు రూ.కోటీ 78 లక్షల విలువ గల ట్యాబ్‌లు ఉచితంగా పంపిణీ చేసినట్లు ఆయన చెప్పారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చిన్న చదువుల నుండి పెద్ద చదువులు వరకూ ప్రభుత్వమే అన్నీ భరిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ వేణుమాధవరెడ్డి, జెడ్‌పిటిసి తిరుమాని బాబ్జీ, సర్పంచి పడవల మేరీ, ఎంపిటిసి అయితం ధనలక్ష్మి పాల్గొన్నారు.గణపవరం : సిఎం జగన్‌ పుట్టినరోజు సందర్భంగా అర్ధవరంలోని జిల్లా పరిషత్‌ హైస్కూల్‌కు చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభకు మండల పరిషత్‌ అధ్యక్షులు దండు వెంకటరామరాజు అధ్యక్షత వహించారు. సభలో పాల్గొన్న ఎంఇఒ పి.శేషు మాట్లాడుతూ విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించారు దండు రాము మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచి ఉదయ భాస్కరరావు, జెడ్‌పిటిసి దేవవరపు సోమలక్ష్మి పాల్గొన్నారు.ఉండి : విద్యార్థులు ప్రభుత్వం ఇచ్చే ట్యాబ్‌లను సద్వినియోగం చేసుకోవాలని ఎంపిపి ఇందుకూరి శ్రీహరి నారాయణరాజు అన్నారు. స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి విద్యార్థులకు శ్రీహరి నారాయణరాజు ట్యాబ్‌లు పంపిణీ చేసి మాట్లాడారు. అలాగే సర్పంచి కమతం సౌజన్య బెనర్జీ మాట్లాడారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్పొరేషన్‌ డైరెక్టర్‌ గులిపల్లి అచ్చారావు, నాయకులు రణస్థుల మహంకాళి, మండల అధ్యక్షులు పెన్మెత్స ఆంజనేయరాజు, కమతం బెనర్జీ, వర్రే ముసలయ్య, బొక్కా శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

➡️