విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీయాలి

సైన్స్‌ దినోత్సవంలో ఎంఇఒ శ్రీనివాసరావు
ప్రజాశక్తి – భీమడోలు
విద్యార్థుల్లో దాగి ఉన్న విజ్ఞాన ప్రతిభను వెలికితీసేందుకు జాతీయ సైన్స్‌ దినోత్సవం కార్యక్రమం దోహదపడుతుందని భీమడోలు విద్యాధికారి శ్రీనివాసరావు అన్నారు. జాతీయ సైన్స్‌ దినోత్సవాన్ని పురస్కరించుకుని భీమడోలు శ్రీ చైతన్య పాఠశాల ప్రిన్సిపల్‌ డి.సోహిని ఆధ్వర్యంలో విద్యార్థులు తమ గైడ్‌ టీచర్ల ఆధ్వర్యంలో తయారుచేసిన పలు ఆవిష్కరణలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఎగ్జిబిషన్‌లో ఆవిష్కరణల ఆశ యాలు, లక్ష్యాలను వివరించారు. కార్యక్రమానికి భీమడోలు విద్యాధికారి ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థులు తయారు చేసిన ఆవిష్కరణను తిలకించారు. దీనిలో భాగంగా విద్యార్థులు తయారుచేసిన మిక్స్డ్‌ ఫార్మింగ్‌, చంద్రయాన్‌-3, గుండె-రక్త ప్రసరణ, కిడ్నీల పనితీరు, సోలార్‌ వ్యవస్థ ఆధారంగా ట్రాఫిక్‌ నియంత్రణ, రక్త గ్రూపు నిర్ధారణ పరీక్ష, ఇతర అంశాలను ప్రదర్శించారు. వీటిలో ఉత్తమమైన ప్రదర్శనగా ఎనిమిదో తరగతి విద్యార్థులు జి.రిత్విక్‌, జి.ప్రేమనాగసాయి తయారుచేసిన చంద్రయాన్‌-3 ఎంపికైంది. న్యాయ నిర్ణేతలుగా భీమడోలు శ్రీ వెంకటేశ్వర డిగ్రీ, జూనియర్‌ కళాశాలకు చెందిన సైన్స్‌ విభాగం అధా ్యపకులు మమత, ఎన్‌.సుబ్బారావు వ్యవహరించారు. వీరు చంద్రయాన్‌తో పాటు మరొక రెండు అంశాలను ద్వితీయ, తృతీయ ప్రదర్శనలుగా నిర్ధారణ చేశారు. విజేతలకు బహు మతి ప్రదానం ప్రముఖుల చేతులమీదుగా చేశారు. ఈ కార్య క్రమంలో చైతన్య పాఠశాలకు చెందిన ముఖేష్‌ కుమార్‌తో పాటు పలువురు ఇతర సబ్జెక్ట్‌ అధ్యాపకులు పాల్గొన్నారు
.అన్నేవారిగూడెం ఉన్నత పాఠశాలలో..
అన్నేవారిగూడెం మండల పరిషత్‌ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు షేక్‌ మస్తాన్‌ ఆధ్వర్యంలో జాతీయ సైన్స్‌ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు సైన్స్‌ దినోత్సవ ప్రాముఖ్యత గురించి వివరించారు. జిల్లా స్థాయిలో నిర్వహించిన ఇన్స్‌స్పైర్‌ అవార్డు పోటీల్లో విజేతగా నిలిచిన పాఠశాల విద్యార్థి దాసరి చైతన్యకృష్ణకుమార్‌ ను పాఠశాల యాజమా న్యం తరపున అబి óనందించి సత్కరించారు. విద్యార్థులు తయారుచేసిన పలు ఆవిష్కరణలు, విద్యా ర్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి ప్రధానో పాధ్యాయులు తగు రీతిలో సత్కరించారు.
        ఏలూరు టౌన్‌ : దెందులూరులో బిఆర్‌డి స్కూల్‌ ఆఫ్‌ నర్సింగ్‌ విద్యార్థులు జాతీయ సైన్స్‌ దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ విజ్ఞాన శాస్త్రవేత్తల పరిశోధన ప్రతిభను అంతర్జాతీయ స్థాయిలో ఇనుమడింప చేసిన వారిలో రామన్‌ అగ్రగణ్యుడని చెప్పారు. ఆవిష్కరణలో నోబెల్‌ బహుమతి రావటం గర్వకారణమన్నారు. నోబెల్‌ గ్రహీత రామన్‌ పరిశోధనల కోసం భారతీయులు విదేశాలకు వెళ్లటం ఏంటని, విదేశీయులే భారతదేశానికి రావాలని చాటి చెప్పిన వ్యక్తి సర్‌సివి.రామన్‌ అని కొనియాడారు. ప్రతి ఏడాది ఒక థీమ్‌తో సైన్స్‌ దినోత్సవాన్ని నిర్వహిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
         మండవల్లి :సైన్స్‌తోనే సమాజం అభివృద్ధి సాధ్యపడుతుందని శాస్త్రవేత్త సుధామ ఫౌండేషన్‌ అధినేత సుధాబత్తుల విజరుకుమార్‌ అన్నారు. జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో బుధవారం నిర్వహించిన సైన్స్‌ డే కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై సివి.రామన్‌ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విజరుకుమార్‌ మాట్లాడుతూ వాస్తవ విషయాలను చెప్పేది సైన్స్‌ అని అన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా శాస్త్ర సాంకేతిక రంగాల్లో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యార్థుల్లో పోటీ తత్వం పెరగాలన్నారు. నేటి విద్యార్థులు సైన్స్‌పై ఆసక్తిని పెంచుకుని సృజనాత్మకతతో యువ శాస్త్రవేత్తలుగా ఎదగాలన్నారు. అనంతరం సర్‌ సివి.రామన్‌, అబ్దుల్‌కలాం, ఎంఎస్‌ విశ్వనాథన్‌, మోక్షగుండం విశ్వేశ్వరయ్య, అలెగ్జాండర్‌ ఫ్లెమింగ్‌ శాస్త్రవేత్తల ఆవిష్కరణలను విద్యార్థులకు వివరించారు. స్థానిక గ్రంథాలయంలో సైన్స్‌ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సైన్స్‌ ఎగ్జిబిషన్‌లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను అందించారు. ఈ కార్యక్రమంలో ఇండియన్‌ బ్యాంక్‌ మేనేజర్‌ బొంతు దుర్గారావు, ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక సభ్యులు భాస్కరరావు, మండలాధ్యక్షులు టి.అప్పారావు, గ్రంథాలయ నిర్వాహకురాలు షేక్‌ పరిమిన, సైన్స్‌ ఉపాధ్యాయులు జ్యోత్స్న, దుర్గమ్మ, శ్రీదేవి, కాత్యాయని పాల్గొన్నారు.
చింతలపూడి : పాఠశాల దశ నుంచి విద్యార్థులు కష్టపడి చదివితే భవిష్యత్తులో మంచి ఫలితాలు వస్తాయని సర్వశిక్ష అభియాన్‌ ఎపిసి సోమశేఖర్‌ అన్నారు. చింతలపూడి పట్టణంలోని సుబ్బరాజు హైస్కూలులో బుధవారం నిర్వహించిన జాతీయ సైన్స్‌ దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు సైన్స్‌ పట్ల ఆసక్తి చూపించాలని, ప్రయోగాలకు ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉండాలని చెప్పారు. నూతన విషయాలు తెలుసుకోవడానికి వాటిపై ప్రయోగాలు చేయడానికి విద్యార్థులు ఆసక్తి కనబరచాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఇఒ రామారావు పాల్గొన్నారు.

➡️