వెంకటరమణమూర్తికి సాహితీ పురస్కారం

ప్రజాశక్తి – పాలకొల్లు
ప్రముఖ కవి కొప్పర్తి వెంకటరమణమూర్తికి, పాలకొల్లు రసధుని సాహితీ సంస్థ ప్రతిష్టాత్మకమైన పెద్దిబొట్ల బ్రహ్మయ్య స్మారక రసధుని సాహితీ పురస్కారం అందించింది. పాలకొల్లు లయన్స్‌ క్లబ్‌లో కొట్టి భాస్కరరావు అధ్యక్షతన ఆదివారం సభ నిర్వహించారు. ముఖ్య అతిథిలుగా పెద్దిబొట్ల లక్ష్మీనారాయణ, భూపతిరాజు విశ్వనాథరాజు, డాక్టర్‌ రెంటాల వెంకటేశ్వరరావు, సుంకర గోపాల్‌, డాక్టర్‌ కెఎస్‌పిఎన్‌.వర్మ, పెనుమాక రామ్మోహన్‌, జె.జయదుర్గారావు హాజరయ్యారు. కోశాధికారి యర్రంశెట్టి వెంకటరత్నం రసధుని స్వాగత ఉపన్యాసంతో సభ ప్రారంభమైంది. అవార్డు గ్రహీత కొప్పర్తి పాలకొల్లు ఛాంబర్‌ కాలేజీలో తన ఉద్యోగ ప్రస్థానం, రసధుని సాహితీ సంస్థతో తన అనుబంధం గుర్తుచేసుకున్నారు. సాహిత్య రంగంలో తాను చేసిన సేవలను గుర్తించి ఈ సాహితీ పురస్కారం అందించడం అరుదైన గౌరవంగా భావిస్తున్నానన్నారు. చాలా సంతోషంగా ఉందని, తనలో చెలరేగిన అనేక భావ సంఘర్షణలకు అక్షరరూపం తన కవిత్వమని, దానిని ఆదరించిన పాఠకులకు, సాహితీ వేత్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రసధుని సభ్యులు వంగా నరసింహరావు, సివివి.సత్యనారాయణమూర్తి, మాడభూషి కృష్ణప్రసాద్‌, చేగొండి రంగారావు, మామిడిశెట్టి శ్రీనివాసరావు, ఎల్‌బికె.మూర్తిరాజు, కొలాటి పెద్దిరాజు, యు.పెద్దిరాజు, నాగలింగేశ్వరరావు, మండెల భాస్కరరావు, యర్రా అజయకుమార్‌, ఇనుకొండ శేషాద్రి, రాయి సూరిబాబు, చల్లా అన్నపూర్ణేశ్వరరావు, మేడికొండ రామదాసు, మండేల రజని, ఎన్‌.లక్ష్మీనారాయణ, సిద్దిరెడ్డి వెంకటరత్నం, కనూరి జి.బాబు, కారుమూరి సూర్యనారాయణ, కొల్లి నరసింహమూర్తి పాల్గొన్నారు.

➡️