వైసిపితోనే మహిళా సాధికారత

ప్రజాశక్తి – కాళ్ల
మహిళా సాధికారత వైసిపి ప్రభుత్వానికే సాధ్యమని ఉండి నియోజకవర్గ ఇన్‌ఛార్జి, డిసిసిబి ఛైర్మన్‌ పివిఎల్‌.నరసింహరాజు అన్నారు. మండలంలోని పెదఅమిరం గ్రామంలో నాలుగో విడత ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. జగన్‌ ఎన్నికల హామీలో భాగంగా డ్వాక్రా రుణమాఫీ నాలుగు విడతలుగా పూర్తి చేశారన్నారు. 45 నుంచి 60 ఏళ్ల మహిళలకు రూ.75 వేలు, చేయూత ద్వారా మహిళలకు వడ్డీ లేని రుణాలు అందిస్తూ వారి ఆర్థిక సాధికారతకు చేయూతనిచ్చారన్నారు. మండలంలో 21 గ్రామాల్లో 1269 గ్రూపులకు సంబంధించి 12,800 మంది మహిళలకు రూ.66,63,67,732 చెక్కును పంపిణీ చేశారు. వైఎస్‌ఆర్‌ ఆసరా పథకం నాలుగో విడత కింద మంజూరైన రూ.16,68,47,917 చెక్కును అందించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకురాలు పిళ్లంగోళ్ల శ్రీలక్ష్మి, రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పాతపాటి వెంకట శ్రీనివాసరాజు(వాసు), ఎంపిపి పి.శిరీషవిశ్వనాథరాజు, టిటిడి మాజీ సభ్యులు గోకరాజు రామరాజు, ఎంపిడిఒ ఎంఎస్‌.ప్రభాకరరావు, ఎపిఎం కె.శ్రీనివాసరావు, వైసిపి నాయకులు, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు.పాలకొల్లు : గతంలో ఎన్నడూ లేని విధంగా మహిళలకు వైసిపి ప్రభుత్వం అన్ని విధాలా చేయూత ఇచ్చిందని పాలకొల్లు నియోజకవర్గ ఇన్‌ఛార్జి గుడాల గోపీ చెప్పారు. పాలకొల్లు వైసిపి కార్యాలయంలో బుధవారం నిర్వహించిన స్వయం సహాయక సంఘాల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పాలకొల్లులో వైసిపి గెలవకపోయినా ఇంత అభివృద్ధి జరిగిందంటే మళ్లీ జగన్‌ను సిఎం చేసి ఇక్కడ గోపీని గెలిపించుకుంటే ఇంకా అభివృద్ధి జరుగుతుందని డిసిఎంఎస్‌ మాజీ ఛైర్మన్‌ యడ్ల తాతాజీ చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎపి అర్బన్‌ ఫైనాన్షియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ వనం కల్యాణి, పట్టణ అధ్యక్షులు చందక సత్తిబాబు, ఎఎంసి ఛైర్మన్‌ సాల దేవినరసయ్య, రాష్ట్ర మహిళా జాయింట్‌ సెక్రటరీ కర్రా జయసరిత, జిల్లా యూత్‌ జనరల్‌ సెక్రటరీ పెచ్చెట్టి కృష్ణాజీ పాల్గొన్నారు.

➡️