సంగీత విద్వాంసులు ప్రసాద్‌కు సత్కారం

Dec 13,2023 21:03

భీమవరం రూరల్‌
భారతదేశ శాస్త్రీయ సంప్రదాయ సంగీతాన్ని ఆరు దేశాల్లో చాటి చెప్పి విదేశీయుల సత్కారాలు పొంది తిరిగి స్వగ్రామం భీమవరానికి వచ్చిన ప్రముఖ సంగీత విద్వాంసులు పిప్పళ్ల ప్రసాద్‌రావును శ్రీవిజ్ఞానవేదిక ఆధ్వర్య ంలో హౌసింగ్‌ బోర్డులోని శ్రీపద్మావతి వెంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం సత్కరించారు. ఆలయ కమిటీ అధ్యక్షులు కంతేటి వెంకటరాజు, కార్యదర్శి కుక్కల బాల మాట్లాడుతూ దేశ విదేశాల్లో మన సంగీత కళను, దేశ గౌరవాన్ని చాటిచెప్పిన వ్యక్తి పిప్పళ్ల ప్రసాద్‌ అని అన్నారు. పిప్పళ్ల సంగీత సేవలు అద్వితీయమన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ నవంబర్‌ 11 నుంచి డిసెంబర్‌ ఆరు వరకు ఆరు దేశాల్లో సంగీత భజన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం పిప్పళ్ల ప్రసాద్‌ను స్వచ్ఛంద సంస్థలు, కళాకారులు ఘనంగా సత్కరించారు. కళా రంజని నాటక పరిషత్‌ అధ్యక్షులు జవ్వాది శ్రీనివాస్‌, పొకష్‌ నాటక పరిషత్‌ అధ్యక్షులు గొన్నాబత్తుల మల్లేశ్వర రావు, చక్రవర్తి, ప్రజా నాట్య మండలి జిల్లా సభ్యులు ఎం. సీతారామప్రసాద్‌, భట్టిప్రోలు శ్రీనివాసరావు పాల్గొన్నారు.

➡️