సకల సౌకర్యాలకు నెలవు ఐరా విల్లాస్‌

Jan 13,2024 22:50

శాసనమండలి ఛైర్మన్‌ మోషేన్‌రాజు
ప్రజాశక్తి – పాలకోడేరు
శ్రీయ కన్‌స్ట్రక్షన్‌ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మాణం కానున్న ఐరా విల్లాస్‌ సకల సౌకర్యాలకు నెలవు అని శాసనమండలి ఛైర్మన్‌ కొయ్యే మోషేన్‌రాజు, డిసిసిబి ఛైర్మన్‌, ఉండి నియోజకవర్గ ఇన్‌ఛార్జి పివిఎల్‌.నరసింహరాజు అన్నారు. భీమవరానికి అతి దగ్గరలో గొల్లలకోడేరులో శ్రీయ కన్‌స్ట్రక్షన్‌ ఆధ్వర్యంలో నిర్మాణం కానున్న ఐరా విల్లాస్‌ బ్రోచర్‌ను రాజకీయ ప్రముఖులు, కన్‌స్ట్రక్షన్‌ ప్రతినిధులు శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అభివృద్ధికి చిరునామా క్షత్రియ సోదరులని, ఈ ప్రాంతాలను అభివృద్ధి పరిచేందుకు ముందుకు రావడం అభినందనీయని చెప్పారు. భీమవరం జిల్లా కేంద్రమైన తర్వాత అభివృద్ధి మరింత శరవేగంగా జరుగుతుందన్నారు. శ్రీయ కన్‌స్ట్రక్షన్‌ ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో 200 ఐరా విల్లాస్‌ నిర్మించడం అభినందనీయమన్నారు. శ్రీయ కన్‌స్ట్రక్షన్‌ ప్రతినిధులు పెనుమత్స రామరాజు, సుమంత్‌వర్మ మాట్లాడుతూ అత్యధిక ప్రమాణాలతో నూతన టెక్నాలజీతో ఈ విల్లాస్‌ నిర్మాణం జరుగుతుందన్నారు. ఐరా క్లబ్‌, విశాలమైన ఆట స్థలం, ఫంక్షన్‌ హాల్‌, గార్డెన్‌ వంటివి ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎటువంటి లాభాపేక్ష ఆశించకుండా ప్రామాణికంగా నిర్మిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గోకరాజు రామరాజు, నెట్‌ క్యాప్‌ ఛైర్మన్‌ కెకె.రాజు, ఎంపిపి భూపతిరాజు చంటిరాజు, జెడ్‌పిటిసి సభ్యులు పెద్దిశెట్టి లక్ష్మీతులసి, సర్పంచి కుక్కల లక్ష్మి, వైసిపి ముఖ్య నేత కలిదిండి శ్రీనివాస్‌వర్మ పాల్గొన్నారు.

➡️