సమన్వయంతో పని చేయాలి : ఎంపిపి

ప్రజాశక్తి – పాలకోడేరు
అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని పాలకోడేరు ఎంపిపి భూపతిరాజు సత్యనారాయణరాజు (చంటి రాజు) అన్నారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశానికి ఎంపిపి చంటిరాజు అధ్యక్షత వహించి మాట్లాడారు. మండలంలో నెలకొన్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పని చేయాలన్నారు. ముఖ్యంగా తాగునీటిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ సమవేశంలో ఎంపిడిఒ నాగేంద్రకుమార్‌, తహశీల్దార్‌ షేక్‌ హుస్సేన్‌, ఉప ఎంపిపిలు ఆదాడ లక్ష్మీతులసి, నరేష్‌, మండల సర్పంచుల సంఘం కార్యదర్శి బొల్లా శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

➡️