సమస్యలు పరిష్కరించకపోతే సమ్మె మరింత ఉధృతం

ప్రజాశక్తి – భీమవరం

అంగన్‌వాడీ కార్మికుల సమ్మె విచ్ఛన్నకర చర్యలు రాష్ట్ర ప్రభుత్వం విడనాడాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.రాజా రామ్మోహన్‌ రారు అన్నారు. అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ సిఐటియు ఆధ్వర్యంలో భీమవరంలో చేపట్టిన సమ్మె బుధవారం రెండో రోజు కూడా కొనసాగింది. శిబిరాన్ని సందర్శించిన రాజా రామ్మోహన్‌ రారు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాలను బలోపేతం చేయాల్సి ఉన్నప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఎన్నో ఏళ్ల నుంచి పనిచేస్తున్న అంగన్వాడీ వర్కర్లకు, హెల్పర్లకు కనీస వేతనం అమలు చేయకపోవడం దారుణమన్నారు. రానున్న రోజుల్లో అంగన్‌వాడీల సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అంగన్‌శాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ నాయకులు పి.విజయలక్ష్మి, సావిత్రి, దుర్గా, మేరీగ్రేసి, తాయారు, సిఐటియు జిల్లా అధ్యక్షులు జెఎన్‌వి గోపాలన్‌, నాయకులు వాసుదేవరావు, ఇంజేటి శ్రీను, గణేష్‌, కోదండం పాల్గొన్నారు.ఆకివీడు : అంగన్‌వాడీల పట్ల ప్రభుత్వ విధానం మారకుంటే ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామని అంగన్‌వాడీ అసోసియేషన్‌ జిల్లా సహాయ కార్యదర్శి ఎమ్‌డి హసీనా బేగం ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సిఐటియు ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె మండలంలో బుధవారం రెండో రోజు కొనసాగింది. స్థానిక పాత బస్టాండ్‌ సెంటర్లో చేపట్టిన సమ్మెలో ఆమె మాట్లాడారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు పెంకి అప్పారావు, తవిటి నాయుడు, షేక్‌ వలీ, అంగన్‌వాడీ యూనియన్‌ నాయకులు వి.పైడేశ్వరి, ఎన్‌.కనకదుర్గ, ఖాళీ, విజయ పాల్గొన్నారు.ఆచంట (పెనుమంట్ర) : సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కేతా గోపాలన్‌ డిమాండ్‌ చేశారు. అంగన్‌వాడీలు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు రెండో రోజు కొనసాగాయి. ఈ సందర్భంగా గోపాలన్‌, సిఐటియు మండల కార్యదర్శి కోడి శ్రీనివాస ప్రసాద్‌ మాట్లాడారు. సమ్మెకు కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కూసంపూడి సుబ్బరాజు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బల్ల చిన వీరభద్రం, పంచాయతీ కార్మికులు, రైస్‌ మిల్లు కార్మికులు, హమాలీలు మద్దతు తెలిపారు. గణపవరం : అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జక్కంశెట్టి సత్యనారాయణ డిమాండ్‌ చేశారు. తహశీల్దార్‌ కార్యాలయం వద అంగన్‌వాడీలు చేపట్టిన సమ్మెకు ఆయన మద్దతు తెలిపి మాట్లాడారు. అలాగే అంగన్‌వాడీ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు కాటుక ఝాన్సీలక్ష్మి మాట్లాడారు. కార్యక్రంలో సిఐటియు మండల అధ్యక్షులు ఎం.పెంటారావు, అంగన్‌వాడీ మండల నాయుకులు బి.రామకోటి, కెవి.మహాలక్ష్మి, జయలక్ష్మి, వెంకటలక్ష్మి పాల్గొన్నారు.ఆచంట : అంగన్‌వాడీలకు రూ.26 వేల వేతనంతో పాటు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యూటీ అమలు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కేతా గోపాలన్‌ డిమాండ్‌ చేశారు. ఆచంట కచేరీ సెంటర్లో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. దీక్షలకు గోపాలన్‌ సంఘీభావం తెలిపి మాట్లాడారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు వైట్ల ఉషారాణి, అంగన్‌వాడీ కార్యకర్తలు, మైలే విజయలక్ష్మి, గుత్తుల శ్రీదేవి, పుడక నాగలక్ష్మి, వరలక్ష్మి అరుణ్‌ కుమారి, సుజాత, బి రాణి, కమల, ధనలక్ష్మి దుర్గమ్మ పెద్దింట్లు పాల్గొన్నారు.రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీల సమస్యలను పూర్తిగా నిర్వీర్యం చేసే ఆలోచనతో ముందుకెళ్తోందని సిపిఎం సీనియర్‌ నాయకులు కార్యదర్శి తలుపూరి బుల్లబ్బాయి విమర్శించారు. ఆచంట కచేరీ సెంటర్లో చేపట్టిన నిరాహార దీక్షలు బుధవారం కొనసాగాయి. ఈ సందర్భంగా అంగన్‌వాడీ కార్యకర్తలకు సిపిఎం మండల కమిటీ సభ్యులు పి.మోహన్‌రావు, సిర్రా నరసింహమూర్తి, కుసుమే జయరాజు, తోటపల్లి సత్యనారాయణ, మన్నే బ్రహ్మయ్య, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు దాసిరెడ్డి కోటేశ్వరరావు, సిపిఐ జిల్లా ఏరియా నాయకులు శారా జోషి సంఘీభావం తెలిపారు. మొగల్తూరు: అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కవురు పెద్దిరాజు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సిఐటియు ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన రెండోరోజు కొనసాగింది. శిబిరానికి సిపిఎం నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా పెద్దిరాజు మాట్లాడారు. ఆయన వెంట సిపిఎం నాయకులు యడ్ల చిట్టిబాబు, ఎ.సాంబమూర్తి, కొత్తపల్లి నాగరాజు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు తెలగంశెట్టి సత్యనారాయణ, అంగన్‌వాడీలు జి.పెద్దింట్లు, కె.సీత, ఎస్‌.సారమ్మ, రాజి పాల్గొన్నారు.పోడూరు : అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు జిల్లా కౌన్సిల్‌ సభ్యులు పిల్లి ప్రసాద్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. తహశీల్దార్‌ కార్యాలయం వద్ద చేపట్టిన దీక్షకు ఆయన మద్దతు తెలిపి మాట్లాడారు. కార్యక్రమంలో సిఐటియు మండల అధ్యక్షులు బూరాబత్తుల వెంకటరావు, లీడర్లు రాయుడు కుమారి, జక్కంశెట్టి ఉమాదేవి పాల్గొన్నారు.తణుకు రూరల్‌ : అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించే వరకూ సమ్మె ఆగదని సిఐటియు జిల్లా కార్యదర్శి పివి.ప్రతాప్‌ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. స్థానిక కోర్టు వద్ద 2వ రోజు నిరసన తెలిపారు. అనంతరం తహశీల్దార్‌ పిఎన్‌డి.ప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సిఐటియు నాయకులు గార రంగారావు, గుబ్బల గోపి, ఆంజనేయులు, గొల్లపల్లి మేరీ రాజకుమారి, మధుషీలా, ఎం.జ్యోతి, కె.నళినీరాణి పాల్గొన్నారు.పెనుగొండ : అంగన్‌వాడీల వేతనాల పెంపుపై జగన్‌ ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోందని సిఐటియు మండల అధ్యక్షుడు నాగిశెట్టి గంగారావు అన్నారు. సమ్మెకు పెనుగొండ సర్పంచి నక్కా శ్యామలా సోని మద్దతు తెలిపి మాట్లాడారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ వర్కర్ల ప్రాజెక్టు లీడర్‌ తులసి, సిఐటియు నాయ కులు మాదాసు నాగేశ్వరరావు, అంగన్‌వాడీలు పాల్గొన్నారు. పాలకొల్లు : తహశీల్దార్‌ కార్యాలయం వద్ద అంగన్‌వాడీలు చేపట్టిన దీక్షలు రెండోరోజు కొనసాగాయి. ఈ దీక్షలకు జనసేన నేతలు మద్దతు తెలిపారు. తాడేపల్లిగూడెం : అంగన్‌వాడీ కార్యకర్తలకు కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గ్రాడ్యూటీ అమలు చేయాలని సిఐటియు పట్టణ కమిటీ నాయకులు కర్రి నాగేశ్వరరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రెండో రోజు తహశీల్దార్‌ కార్యాలయం వద్ద చేస్తున్న సమ్మెలో ఆయన పాల్గొని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి వలవల మల్లికార్జునరావు (బాబ్జి) మాట్లాడారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు కరెడ్ల రామకృష్ణ, జవ్వాది శ్రీను, సిపిఎం మండల నాయకులు కండెల్లి సోమారాజు, టిడిపి నేతలు పాల్గొన్నారు.ఉండి : తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా సహాయ కార్యదర్శి మహమ్మద్‌ హసీనా బేగం అన్నారు. తహశీల్దార్‌ కార్యాలయం వద్ద అంగన్‌వాడీలు చేస్తున్న సమ్మె రెండో రోజుకు చేరింది. ఈ సందర్భంగా హసీనా బేగం మాట్లాడారు. సమ్మెకు సిఐటియు నాయకులు ధనికొండ శ్రీనివాస్‌, మోపిదేవి రాము మద్దతు పలికారు.పాలకోడేరు: అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెను ఉధృతం చేస్తామని సిఐటియు నాయకులు లారెన్స్‌ కుమారి, వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు శేషాపు అశ్రియ హెచ్చరించారు. తహశీల్దార్‌ కార్యాలయం వద్ద అంగన్‌ వాడీలు చేపట్టిన సమ్మె కొనసాగింది. కార్యక్రమంలో విజయలక్ష్మి, విమల, తులసి, ఎం.విమల, హేమకుమారి, మరియమ్మ పాల్గొన్నారు.యలమంచిలి : అంగన్‌వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె రెండో రోజు కొనసాగింది. సమ్మెకు జిల్లా నాయకురాలు సరిపల్లి జయప్రభ సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి దేవ సుధాకర్‌, నాయకులు రజనీ, పద్మశ్రీ పాల్గొన్నారు.నరసాపురం టౌన్‌: నరసాపురంలో అంగన్‌వాడీలు చేపట్టిన దీక్షలు కొనసాగాయి. దీక్షలకు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు తెలగంశెట్టి సత్యనారాయణ సంఘీభావం తెలిపి మాట్లాడారు. అలాగే సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కౌరు పెద్దరాజు మాట్లాడారు. అనంతరం టిడిపి మహిళా నాయకురాలు శిరిగినీడి రాజ్యలక్ష్మి సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు పట్టణ కార్యదర్శి పొన్నాడ రాము, అంగన్‌వాడీ యూనియన్‌ నాయకులు గుబ్బల రాజేశ్వరి, భోగేశ్వరి, జైశ్రీలక్ష్మి పాల్గొన్నారు.కాళ్ల : రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీల డిమాండ్లు పరిష్కరించాలని ఎంఎల్‌ఎ మంతెన రామరాజు కోరారు. తహశీల్దార్‌ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె రెండో రోజు కొనసాగింది. సమ్మెకు ఎంఎల్‌ఎ సంఘీభావం తెలిపారు. సిఐటియు మండల అధ్యక్షులు గొర్ల రామకృష్ణ మాట్లాడారు. సంఘం కార్యదర్శి మండా సూరిబాబు, అంగన్‌వాడీ నాయకులు యడవల్లి చంద్రావతి, ఝాన్సీరాణి పాల్గొన్నారు.పెంటపాడు : స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద అంగన్‌వాడీలు చేపట్టిన సమ్మె కొనసాగింది. సమ్మెనుద్దేశించి అంగన్‌వాడీ నాయకులు ఆర్‌.అనురాధ, వి.కనకమహాలక్ష్మి, సిఐటియు నాయకులు సిరపరపు రంగారావు, చిర్ల పుల్లారెడ్డి, బంకురు నాగేశ్వరరావు మాట్లాడారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ కె.మంగ తాయారు, టి.వెంకటలక్ష్మి, వరలక్ష్మి, నాగమణి, శిరీష, ఝాన్సీలక్ష్మి, విజయలక్ష్మి, గాయత్రి, గంగా భవాని, హైమావతి పాల్గొన్నారు.

➡️